IND vs PAK: “ఈ విజయం వారికి అంకితం..”: గూస్ బంప్స్ తెప్పిస్తోన్న సూర్య స్టేట్‌మెంట్
Team India: భారత జట్టు, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ 25 బంతుల ముందే ముగిసింది. టాస్ ఓడిన తర్వాత, టీమిండియా ముందుగా బౌలింగ్ వేసింది. భారత బౌలర్లు ప్రత్యర్థులను చిత్తు చేశారు. పాకిస్తాన్ జట్టు మొత్తం 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత, టీమిండియా 25 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో గెలిచింది.

India vs Pakistan, 6th Match, Group A: ఆసియా కప్ 2025లో సెప్టెంబర్ 14 రాత్రి భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. విజయం తర్వాత, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాడు. అతను ప్రత్యర్థి జట్టు వైపు కూడా చూడలేదు. ఆ తర్వాత భారత్-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత, టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పహల్గామ్ దాడి గురించి మాట్లాడాడు. ఈ విజయాన్ని దేశ సైన్యానికి అంకితం చేస్తున్నానని, ఈ విజయం ధైర్యసాహసాలు ప్రదర్శించిన దేశ సాయుధ దళాలకు అంకితం చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్ పై విజయం తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే?
భారత జట్టు పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విజయం తర్వాత, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ తర్వాత ప్రెజెంటేషన్ కోసం వచ్చాడు. మైదానంలో ఉన్న ప్రేక్షకులు అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
సూర్యకుమార్ యాదవ్ సెప్టెంబర్ 14న 35 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ మేరకు ప్రేక్షకుల శుభాకాంక్షలకు స్పందించిన సూర్య, ‘ ఇది భారతదేశానికి గొప్ప అనుభూతి, ఫ్యాన్స్ కు రిటర్న్ గిఫ్ట్’ అని అన్నాడు.
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో గెలవాలని ఎప్పుడూ కోరుకుంటానని ఒప్పుకున్నాడు. కానీ, టీం ఇండియా అన్ని జట్లపై గెలవడానికి సన్నాహాలు చేస్తోంది. ఆటగాళ్లను కూడా ఆయన చాలా ప్రశంసించారు.
ఇదే విషయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘మనం ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటాం, గెలిచినప్పుడు, అంతా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. నేను ఎప్పుడూ ఇదే కోరుకుంటాను. మేం అన్ని ప్రత్యర్థులకు సమానంగా సిద్ధమవుతాం. కొన్ని నెలల క్రితం ఇలాగే జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన జట్టు టోన్ సెట్ చేసింది. నేను ఎప్పుడూ స్పిన్నర్ల అభిమానిని. ఎందుకంటే, వారు ఆటను మధ్యలో ఊహించని విధంగా మార్చేస్తారు‘ అని తెలిపాడు.
సాయుధ దళాలకు, పహాల్గం బాధితులకు అంకితం..
Well done #TeamIndia 🇮🇳 Well done #SuryakumarYadav 🔥
No handshake.. Dedicated win to the families of victims of #PahalgamTerrorAttack . Also expressed solidarity with #IndianArmedForces 🔥
Message is LOUD and CLEAR.. Indian team will stand by its ground without compromising. pic.twitter.com/BrQqc0BV0O
— Lakshya (@IamLakshya_) September 14, 2025
పాకిస్థాన్ పై విజయం తర్వాత, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదట ఆటగాళ్లు, మ్యాచ్ గురించి మాట్లాడాడు. ఆ తర్వాత అతను ఈ విజయాన్ని సాయుధ దళాలకు అంకితం చేశాడు. పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలకు అండగా నిలబడటానికి ఇది సరైన అవకాశం. మేం మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం అంటూ తెలిపాడు.
‘ఈ విజయాన్ని అపారమైన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన సాయుధ దళాలన్నింటికీ అంకితం చేయాలనుకుంటున్నాను. వారు మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటారని‘ చెప్పుకొచ్చాడు.
టీం ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం..
భారత జట్టు, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ 25 బంతుల ముందే ముగిసింది. టాస్ ఓడిన తర్వాత, టీమిండియా ముందుగా బౌలింగ్ వేసింది. భారత బౌలర్లు ప్రత్యర్థులను చిత్తు చేశారు. పాకిస్తాన్ జట్టు మొత్తం 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత, టీమిండియా 25 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో గెలిచింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అత్యధికంగా 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








