IND vs SA: టెస్ట్ కెప్టెన్సీలో ఆయనే నంబర్ వన్.. అక్కడ సిరీస్ గెలిస్తే చరిత్రలో నిలుస్తాడు: టీమిండియా మాజీ దిగ్గజ బౌలర్
Virat Kohli: విరాట్ కోహ్లి సారథ్యంలో ముంబై టెస్టులో భారత్ 372 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది పరుగుల పరంగా అతిపెద్ద విజయం.
India vs South Africa: దక్షిణాఫ్రికా టూర్‌కు టీమిండియా ఎంపిక ఏ క్షణంలోనైనా జరగవచ్చు. అయితే అంతకుముందే విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై పెద్ద ప్రకటన వెలువడింది. విరాట్ కోహ్లీని టెస్ట్ కెప్టెన్‌గా అభివర్ణించిన భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్.. టీమిండియా కెప్టెన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విజయం సాధించిన అనంతరం ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ భారత క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిచాడంటూ ప్రశంసల జల్లు కురిపించాడు.
విరాట్ కోహ్లి సారథ్యంలో, ముంబై టెస్టులో భారత్ 372 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది పరుగుల పరంగా భారత్‌కు అతిపెద్ద విజయం. ఈ అద్భుత విజయంతో న్యూజిలాండ్‌తో జరిగిన 2 టెస్టుల సిరీస్‌ను కూడా భారత్ కైవసం చేసుకుంది. భారత్ సిరీస్ విజయం తర్వాత ఇర్ఫాన్ పఠాన్ ట్విట్టర్ ద్వారా తన మనసులోని మాటను బయటపెట్టాడు. టెస్టుల్లో భారత అత్యుత్తమ కెప్టెన్ విరాట్ కోహ్లీనే అని పేర్కొన్నాడు.
తన ట్వీట్‌లో, ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా ఇద్దరు విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ల మధ్య విజయ శాతం వ్యత్యాసాన్ని కూడా పేర్కొన్నాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లి విజయ శాతం 59.09గా ఉంది. కనీసం 10 టెస్టులకు సారథ్యం వహించిన ప్రస్తుత టెస్టు కెప్టెన్లలో విజయాల పరంగా కూడా విరాట్ మొదటి స్థానంలో ఉన్నాడు.
విరాట్ టార్గెట్‌లో దక్షిణాఫ్రికా.. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విజయం స్వదేశంలో గత 8 ఏళ్లలో భారత్‌కు వరుసగా 14వ టెస్టు సిరీస్ విజయంగా నిలిచింది. 2013 నుంచి భారత జట్టు స్వదేశంలో ఏ సిరీస్‌ను కోల్పోలేదు. ఇందులో విరాట్ కోహ్లి సారథ్యంలో భారత్ అత్యధిక మ్యాచ్‌లు గెలిచింది. విరాట్ కోహ్లీ ఇప్పుడు దక్షిణాఫ్రికా టూర్‌పై కన్నేశాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ గెలిచిన తర్వాత.. దక్షిణాఫ్రికా టూర్ మనకు పెద్ద సవాల్‌గా మారనుందని అన్నాడు. మేం అక్కడ ఇప్పటి వరకు టెస్టు సిరీస్ గెలవలేదు. ఈసారి మాకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు చేయనిది అక్కడ చేయాలనుకుంటున్నాం అని కోహ్లీ పేర్కొన్నాడు.
As I have said earlier and saying it again @imVkohli is the best Test Captain India have ever had! He’s at the top with the win percentage of 59.09% and the second spot is at 45%.
— Irfan Pathan (@IrfanPathan) December 6, 2021
Also Read: IND vs NZ: ఆయన లేకుంటే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌కు ఘోర పరాజయాలు తప్పవు: కివీస్ మాజీ కోచ్