AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: ‎ఆయన లేకుంటే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌కు ఘోర పరాజయాలు తప్పవు: కివీస్ మాజీ కోచ్

Kane Williamson: గాయం కారణంగా కేన్ విలియమ్సన్ ముంబై టెస్టులో ఆడలేదు. దీంతో న్యూజిలాండ్ 372 పరుగులతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

IND vs NZ: ‎ఆయన లేకుంటే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌కు ఘోర పరాజయాలు తప్పవు: కివీస్ మాజీ కోచ్
India Vs New Zealand Kane Williamson
Venkata Chari
|

Updated on: Dec 07, 2021 | 10:00 AM

Share

India Vs New Zealand: ముంబై టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను 372 పరుగుల తేడాతో ఓడించింది సిరీస్‌ను 1-0 తేడాతో గెలుచుకుంది. ఈ ఓటమితో న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌‌తో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లోనూ పడిపోయింది. న్యూజిలాండ్ ఓటమికి ప్రధాన కారణం పేలవమైన ఆట, అలాగే న్యూజిలాండ్ రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ కూడా లేకపోవడం. గాయం కారణంగా కేన్ విలియమ్సన్ ముంబై టెస్టు ఆడలేకపోయాడు. కేన్ విలియమ్సన్‌కు మోచేతి గాయం మరోసారి ఎటాక్ కావడంతో టీమ్ మేనేజ్‌మెంట్ అతనికి విశ్రాంతి ఇచ్చింది. ఫలితంగా ముంబైలో న్యూజిలాండ్ బ్యాటింగ్ పేకమేడలా కూలిపోయింది. కేన్ విలియమ్సన్ మోచేతి నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నాడు. దీనిపై న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్ ఆందోళన వ్యక్తం చేశాడు. కివీస్ కెప్టెన్ కొంతకాలం క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుందని మైక్ హెస్సన్ అభిప్రాయపడ్డాడు.

శస్త్రచికిత్స చేయాల్సిందే! విలియమ్సన్ మోచేతి నొప్పి నుంచి బయటపడాలంటే, శస్త్రచికిత్సతోనే వీలవుతుందని కివీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ స్మిత్‌తో జరిగిన సంభాషణలో మైక్ హెస్సన్ పేర్కొన్నాడు. హెస్సన్ మాట్లాడుతూ, ‘విలియమ్సన్‌కు శస్త్రచికిత్స మాత్రమే చివరి ఎంపిక అని నాకు అనిపిస్తోంది. విలియమ్సన్ చాలా కలత చెందాడని నాకు తెలుసు. ఎందుకంటే అతనికి చాలా విశ్రాంతి ఇచ్చారు. అతని మోచేయి ఇంకా నయం కాలేదు. గత 18 నెలల్లో విలియమ్సన్ చాలా మ్యాచ్‌లకు దూరమయ్యాడని తెలిపాడు.

హెస్సన్ మాట్లాడుతూ, ‘విలియమ్సన్‌కు ఇటీవల తుంటి గాయం అయింది. అయితే అతని మోచేయి గాయం చాలా కాలంగా వేధిస్తోనే ఉంది. అతను ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని నేను భావిస్తున్నాను. కొంతకాలం క్రికెట్‌కు దూరంగా ఉండటం వల్ల గాయం నుంచి పూర్తిగా బయటపడొచ్చని’ పేర్కొన్నాడు.

వచ్చే ఏడాది న్యూజిలాండ్‌కు చాలా ముఖ్యం.. న్యూజిలాండ్ ప్రస్తుతం జనవరి నుంచి నిర్విరామంగా క్రికెట్ ఆడవలసి ఉంటుంది. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో 2-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడనుంది. దీనిలో కేన్ విలియమ్సన్ విశ్రాంతి తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే దీని తర్వాత ఆస్ట్రేలియాతో 3 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ను కూడా ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఫిబ్రవరి-మార్చిలో, దక్షిణాఫ్రికా జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఇందులో 2 టెస్టులు ఆడతాయి. ఆ తర్వాత మార్చిలో న్యూజిలాండ్‌ పర్యటనలో భారత జట్టు 3 వన్డేల సిరీస్‌ ఆడనుంది.

Also Read: IND vs SA: ఆ స్టార్ బౌలర్‌పై విరాట్ కోహ్లీకి నమ్మకం లేదా? దిగ్గజ స్పిన్నర్ ఆవేదనతో మరోసారి బయటపడ్డ విభేదాలు..!

Ashes Series: యాషెస్ తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్.. గాయంతో స్టార్ బౌలర్ దూరం..!

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..