IND vs SA: ఆ స్టార్ బౌలర్‌పై విరాట్ కోహ్లీకి నమ్మకం లేదా? దిగ్గజ స్పిన్నర్ ఆవేదనతో మరోసారి బయటపడ్డ విభేదాలు..!
Ravichandran Ashwin: న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్ 14 వికెట్లు పడగొట్టి, సిరీస్‌లో అత్యుత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు.
India Vs South Africa: ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు టీమిండియా 372 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. 540 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 167 పరుగులకే ఆలౌటైంది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 4 వికెట్లు తీసిన ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ విజయంలో కీలకపాత్ర పోషించాడు. రవిచంద్రన్ అశ్విన్ తన అద్భుతమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా అందుకున్నాడు. అశ్విన్ కూడా తన ప్రదర్శనతో చాలా సంతృప్తిగా ఉన్నాడు. ఈ మేరకు అశ్విన్ మాట్లాడుతూ, ‘ఇది బహుశా నా 10వ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అని నేను అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే, నేను వాంఖడేలో బౌలింగ్ చేయడం చాలా ఆనందించాను. ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకున్నాను’ అని పేర్కొన్నాడు.
అయితే, ఈ విజయం తర్వాత, అశ్విన్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. దక్షిణాఫ్రికా విజయంలో కూడా తనవంతు పాత్ర పోషించాలని అశ్విన్ అన్నాడు. అశ్విన్ మాట్లాడుతూ, ‘నేను దక్షిణాఫ్రికాలో కీలక పాత్ర పోషించి సిరీస్ గెలవాలనుకుంటున్నాను. మేం ఇంతకు ముందెన్నడూ ఇలా చేయలేదు. ఈసారి చేయగలమని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నాడు.
అశ్విన్ బాధ ఎందుకంటే? అశ్విన్ దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లడంపై మాట్లాడాడు. ఈ సందర్భంగా తన బాధను కూడా తెలియజేశాడు. నిజానికి ఇంగ్లండ్ టూర్‌లో టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్ లోనూ అశ్విన్‌కు అవకాశం ఇవ్వలేదు. అశ్విన్ నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్నాడు. ఇంగ్లండ్‌లో ఫాస్ట్‌బౌలర్లకు ఎక్కువ సాయం అందుతున్న నేపథ్యంలో అశ్విన్‌కు అవకాశం ఇవ్వకూడదని టీమిండియా నిర్ణయించింది. అదే సమయంలో, స్పిన్ ఆల్ రౌండర్‌గా అశ్విన్‌కు బదులుగా జడేజా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికాలో కూడా ఇలా చేస్తారా లేదా చూడాలి.
అయితే దక్షిణాఫ్రికాలో పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు సహాయపడతాయి. ఆ టెస్ట్ సిరీస్‌లో అశ్విన్‌కు ఆడే అవకాశం రాకపోవచ్చని తెలుస్తుంది. అయితే రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్‌గా మారిపోయాడు. శాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్ వచ్చి విరాట్ కోహ్లీతో కలిసి భిన్నమైన వ్యూహాలను రచిస్తారు. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో అశ్విన్‌కు అవకాశం ఇస్తాడని భావిస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో అశ్విన్ పేలవ ప్రదర్శన.. దక్షిణాఫ్రికాలో ఆర్. అశ్విన్ రికార్డు ప్రత్యేకంగా ఏం లేదు. దక్షిణాఫ్రికాలో ఆడిన మూడు టెస్టుల్లో కేవలం 7 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా ఈసారి అతడిపై విశ్వాసం ఉంచుతుందా లేదా చూడాలి.
Also Read: Ashes Series: యాషెస్ తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్.. గాయంతో స్టార్ బౌలర్ దూరం..!