AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వామ్మో.. ప్రిన్స్‌లోనూ ఈ యాంగిల్ ఉందా.. లైవ్ మ్యాచ్‌లో ఆకాష్ దీప్‌పై ఫైర్.. కారణం ఏంటంటే?

రెండో రోజు భారత జట్టు 587 పరుగులకు ఆలౌట్ అయింది. డబుల్ సెంచరీతో గిల్ ఆకట్టుకోగా, జడేజా, సుందర్ కూడా కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది.

Video: వామ్మో.. ప్రిన్స్‌లోనూ ఈ యాంగిల్ ఉందా.. లైవ్ మ్యాచ్‌లో ఆకాష్ దీప్‌పై ఫైర్.. కారణం ఏంటంటే?
Shubman Gill Fire on Akash Deep
Venkata Chari
|

Updated on: Jul 04, 2025 | 6:52 AM

Share

క్రికెట్ మైదానంలో భావోద్వేగాలు సహజం. ఒత్తిడిలో ఉన్నప్పుడు, కీలకమైన మ్యాచ్‌లలో, ఆటగాళ్ల మధ్య చిన్నపాటి విభేదాలు లేదా వాదనలు జరగడం అసాధారణం కాదు. తాజాగా బర్మింగ్‌హామ్‌లో జరిగిన భారత్ vs ఇంగ్లాండ్ రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ ఇదే సీన్ చోటు చేసుకుంది. కాగా, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ 269 పరుగులు చేశాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ భవిష్యత్తులో చాలా చర్చనీయాంశమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 151 ఓవర్లలో 587 పరుగులకు ఆలౌట్ అయింది. ఎనిమిది గంటలకు పైగా బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్‌లో టెస్ట్‌లలో ఒక భారతీయ బ్యాట్స్‌మన్ సాధించిన అత్యధిక స్కోరులో చోటు దక్కించుకున్న గిల్.. తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరును సాధించాలనే గిల్ పట్టుదల స్పష్టంగా కనిపించింది.

అనంతరం ఇంగ్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, భారత బౌలర్లు వికెట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆకాష్ దీప్ తన బౌలింగ్‌లో ఒకసారి బంతిని డెలివరీ చేసిన తర్వాత, ఫీల్డింగ్ పొజిషన్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ వైపు చూశాడు. బహుశా ఏదో ఒక సూచన కోసం చూసి ఉండవచ్చు, లేదా కేవలం ఒక సాధారణ చూపు అయి ఉండవచ్చు. అయితే, ఆ సమయంలో శుభ్‌మన్ గిల్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించాడు. ఆకాష్ దీప్ తృటిలో రన్ ఔట్ నుంచి తప్పించుకున్నాడు. ఆ వెంటనే గిల్, “దేఖ్ క్యా రహా హై? బాల్ డాల్‌నా హై నా?” (ఏం చూస్తున్నావు? బంతిని చూడాలి కదా?) అంటూ కాస్త ఆవేశంగా అరిచాడు. ఈ సంఘటన స్టంప్ మైక్రోఫోన్‌లలో స్పష్టంగా రికార్డైంది.

2వ రోజు టీకి ముందు, గిల్ త్వరగా సింగిల్ తీయాలని కోరుకున్నాడు. కానీ, ఆకాష్ దీప్ అంతగా సిద్ధంగా లేడు. మిడ్ ఆన్‌లో ఉన్న ఓల్లీ పోప్ తన కుడి వైపునకు డైవ్ చేసి, బంతిని కీపర్ వైపు విసిరాడు. బంతి డైరెక్ట్‌గా వికెట్‌కి తగిలి ఉంటే, ఆకాశ్ దీప్ పెవిలియన్ చేరేవాడు. రన్ చేయడంలోనూ ఆకాశ్ దీప్ బద్దకంగా కనిపించాడు. ఈ క్రమంలో గిల్ ఆకాశ్ దీప్‌పై ఆగ్రహంగా కనిపించాడు.

నాన్-స్ట్రైకర్ ఎండ్‌కు చేరుకున్న తర్వాత గిల్, ఆకాష్ దీప్‌ను ఉద్దేశిస్తూ “దేఖ్ క్యా రహా హై? భాగ్ జల్దీ సే (ఏమి చూస్తున్నావు? త్వరగా పరిగెత్తు)” అని గిల్ అరిచాడు. భారత టెస్ట్ కెప్టెన్ అయిన తర్వాత తన సహచరుడిపై గిల్ చూపిన అరుదైన ఆగ్రహం ఇదేనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మ్యాచ్ పరిస్థితి..

రెండో రోజు భారత్ తరపున శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ సాధించాడు. అతను 269 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో, గిల్ ఆరో వికెట్‌కు రవీంద్ర జడేజాతో కలిసి 203 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని, వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ఏడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పాడు. దీంతో భారత జట్టు 587 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..