AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ‘లీడర్ ఆఫ్ మెన్’‌గా రోహిత్ శర్మ.. స్పెషల్ అవార్డ్‌తో సత్కరించిన బీసీసీఐ

Team India: కెప్టెన్సీ లేకపోయినా, మైదానంలో విరాట్ కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడం, యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడం వంటి అంశాలను టీమ్ మేనేజ్‌మెంట్ ప్రత్యేకంగా గుర్తించింది. కోచ్ గౌతమ్ గంభీర్ సైతం రోహిత్ శర్మ సెంచరీని, విరాట్ కోహ్లీతో కలిసి జట్టును విజయతీరం చేర్చిన తీరును కొనియాడారు.

Video: 'లీడర్ ఆఫ్ మెన్'‌గా రోహిత్ శర్మ.. స్పెషల్ అవార్డ్‌తో సత్కరించిన బీసీసీఐ
Rohit Sharma
Venkata Chari
|

Updated on: Oct 27, 2025 | 8:11 PM

Share

Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, జట్టు యాజమాన్యం నుంచి ‘లీడర్ ఆఫ్ మెన్’ అనే ప్రత్యేక ప్రశంసను, ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత, ముఖ్యంగా టెస్టులు, టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించి, వన్డే కెప్టెన్సీని శుభ్‌మన్ గిల్‌కు అప్పగించిన తర్వాత, రోహిత్ ఫామ్‌పై చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 202 పరుగులు (సగటు 101) చేసి, తన అనుభవాన్ని, సత్తాను మరోసారి నిరూపించుకున్నారు.

‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ పురస్కారం..

సిరీస్ ముగిసిన అనంతరం, టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా భారత జట్టు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లె రూ రోహిత్ శర్మను ప్రత్యేకంగా అభినందించారు.

ఇవి కూడా చదవండి

“ఈ అవార్డును ఒక ప్రత్యేకమైన వ్యక్తికి అందించడం నాకు దక్కిన గౌరవం. అతను ‘లీడర్ ఆఫ్ మెన్’, ఎంతో అనుభవజ్ఞుడైన ఆటగాడు. ఈ సిరీస్‌లో మీరు ఆ నాయకత్వ లక్షణాన్ని చూపించారు. ఈ ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు రోహిత్‌కే దక్కుతుంది,” అని లె రూ ప్రకటించారు.

కెప్టెన్సీ లేకపోయినా, మైదానంలో విరాట్ కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడం, యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడం వంటి అంశాలను టీమ్ మేనేజ్‌మెంట్ ప్రత్యేకంగా గుర్తించింది. కోచ్ గౌతమ్ గంభీర్ సైతం రోహిత్ శర్మ సెంచరీని, విరాట్ కోహ్లీతో కలిసి జట్టును విజయతీరం చేర్చిన తీరును కొనియాడారు.

సిరీస్‌లో రోహిత్ శర్మ మొత్తం 202 పరుగులు సాధించాడు. దీంతో రీఎంట్రీలో సత్తా చూపించాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాపై 121 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్ ఆడి, భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇది అతనికి 50వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం.

పెర్త్‌లో నిరాశపరిచినప్పటికీ, అడిలైడ్‌లో కఠిన పరిస్థితుల్లో 73 పరుగులు చేసి, సిడ్నీలో సెంచరీతో జట్టును గెలిపించిన తీరు అతని దృఢ సంకల్పాన్ని చాటింది. ఈ అవార్డు, కేవలం పరుగులకే కాకుండా, జట్టులో రోహిత్ శర్మకున్న అపారమైన అనుభవాన్ని, స్ఫూర్తిని గుర్తించి ఇచ్చిన సన్మానంగా క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి