Video: ఇంగ్లాండ్ చేతిలో ఓటమి.. కట్‌చేస్తే.. డ్రెస్సింగ్ రూంలో స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ ఏం చేశారో తెలుసా?
Team India: స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో వరుసగా మూడు ఓటములు, అందులో రెండూ దాదాపు గెలిచే మ్యాచ్‌లు చేజార్చుకోవడం భారత జట్టుకు, అభిమానులకు పెద్ద నిరాశను మిగిల్చింది. సెమీస్ చేరేందుకు ఇకపై ప్రతి మ్యాచ్ గెలవడంతో పాటు, మెరుగైన ప్రదర్శన చేయాల్సిన ఒత్తిడి హర్మన్‌ప్రీత్ కౌర్, కోచ్ అమోల్ మజుందార్‌పై ఉంది.

Team India: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో ఇంగ్లాండ్‌తో జరిగిన ముఖ్యమైన మ్యాచ్‌లో భారత్ జట్టుకు హృదయ విదారకమైన ఓటమి ఎదురైంది. ఈ పరాజయం సెమీ-ఫైనల్ ఆశలను సంక్లిష్టం చేయగా, టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తీవ్ర భావోద్వేగానికి లోనైంది. డ్రెస్సింగ్ రూమ్‌లో విషాదకర వాతావరణం, కోచ్ అమోల్ మజుందార్ సీరియస్ లుక్ చర్చనీయాంశమయ్యాయి.
చేయి దాటిన విజయం.. కన్నీళ్లు పెట్టిన స్మృతి..
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఇంగ్లాండ్ నిర్దేశించిన 289 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు కేవలం 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ఇది వరుసగా మూడో ఓటమి.
వైస్-కెప్టెన్ స్మృతి మంధాన (88 పరుగులు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70 పరుగులు)తో కలిసి మూడో వికెట్‌కు 125 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దీంతో భారత్ విజయం దిశగా సాగుతోందని అభిమానులు ఆశించారు.
మంధాన అనవసరమైన షాట్‌కు యత్నించి 88 పరుగుల వద్ద ఔట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఔట్ అయింది. అప్పటిదాకా క్రీజులో పాతుకుపోయి, జట్టును విజయానికి దగ్గరగా తీసుకెళ్లిన ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ ఔట్ కావడం భారత బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత డగౌట్‌లో కూర్చున్న స్మృతి మంధాన తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తన కళ్ల నుంచి కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. లక్ష్యం దాదాపు చేతికి చిక్కినట్లే ఉన్నా, తన వికెట్ కోల్పోవడం వల్లనే పరాజయం ఎదురైందనే ఆవేదన, నిరాశ ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించాయి.
‘నా తప్పే’: మంధాన ఆత్మవిమర్శ..
— The Game Changer (@TheGame_26) October 19, 2025
మ్యాచ్ అనంతరం స్మృతి మంధాన తన వికెట్ కోల్పోవడం గురించే మాట్లాడుకుంది. “ఓవర్‌కు కేవలం 6 పరుగులు మాత్రమే కావాలి. బహుశా మేం ఆటను మరింత లోతుగా తీసుకెళ్లాల్సింది. బ్యాటింగ్ కుప్పకూలడం నా దగ్గర నుంచే మొదలైంది. కాబట్టి, నేను దీనికి బాధ్యత తీసుకుంటాను. ఏరియల్ షాట్స్ ఆడొద్దని నాకే నేను చెప్పుకున్నా, ఆ సమయంలో ఉద్వేగానికి లోనై షాట్ కొట్టా. క్రికెట్‌లో ఉద్వేగాలు ఎప్పుడూ సహాయం చేయవు” అని తన ఆవేదనను వ్యక్తం చేసింది.
కోచ్ మజుందార్ హెచ్చరిక, హర్మన్ ఫెయిల్యూర్..
భారత జట్టు హెడ్ కోచ్ అమోల్ మజుందార్ కూడా ఈ పరాజయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్‌తో మజుందార్ సీరియస్‌గా మాట్లాడిన దృశ్యాలు చర్చకు దారితీశాయి.
ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత కూడా, ఆటను గొప్పగా ప్రారంభించడం కంటే, సరిగ్గా ముగించడం చాలా ముఖ్యమని అమోల్ మజుందార్ చెప్పుకొచ్చారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం, చివరి క్షణాల్లో ఒత్తిడికి లోనై వికెట్లు చేజార్చుకోవడంతో, ఫినిషింగ్ విషయంలో భారత జట్టు వైఫల్యాన్ని మజుందార్ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.
రికార్డు భాగస్వామ్యం నెలకొల్పినప్పటికీ, హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా అనవసరమైన షాట్‌తో ఔట్ కావడం జట్టుకు భారీ నష్టాన్ని కలిగించింది. ఈ ఓటమితో సెమీ-ఫైనల్ బెర్త్ కోసం భారత్ ఇప్పుడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌పై గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యంగా స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో వరుసగా మూడు ఓటములు, అందులో రెండూ దాదాపు గెలిచే మ్యాచ్‌లు చేజార్చుకోవడం భారత జట్టుకు, అభిమానులకు పెద్ద నిరాశను మిగిల్చింది. సెమీస్ చేరేందుకు ఇకపై ప్రతి మ్యాచ్ గెలవడంతో పాటు, మెరుగైన ప్రదర్శన చేయాల్సిన ఒత్తిడి హర్మన్‌ప్రీత్ కౌర్, కోచ్ అమోల్ మజుందార్‌పై ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








