
Axar Patel: ఆసియా కప్-2023 ఫైనల్‌కు ముందు టీమిండియాలో పెద్ద మార్పు కనిపించింది. చివరి క్షణంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులో చేరడానికి కొలంబో బయలుదేరాడు. గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో సుందర్‌ని పిలిచారు. ఆదివారం శ్రీలంకతో భారత్ ఫైనల్ ఆడాల్సి ఉంది. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ తన ఆటతో ఆకట్టుకోలేకపోయాడు.
సుందర్ ఇటీవలే టీమిండియాతో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడాడు. అయితే రెండు మ్యాచ్‌ల్లోనూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. సుందర్ IPL-2023లో గాయపడ్డాడు. దాని కారణంగా అతను చాలా కాలం పాటు జట్టుకు దూరంగా ఉండవలసి వచ్చింది.
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ గాయపడ్డాడు. అతని గాయం ఎంత తీవ్రంగా ఉందో పరిస్థితి ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే అతను ఫైనల్ ఆడటంపై సందేహం నెలకొంది. అందుకే సుందర్‌ని అతని బ్యాకప్‌గా పిలిచారు. సుందర్ ఆసియా గేమ్స్‌లో పాల్గొనే భారత జట్టులో చేరాడు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడు. బంగ్లాదేశ్‌పై అక్షర్ 34 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. తొమ్మిది ఓవర్లు వేసిన అతను 47 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. అతనికి రెండుసార్లు బంతి తగిలింది. అక్షర్ బ్యాటింగ్ చేస్తుండగా శ్రీలంక ఫీల్డర్ వేసిన బంతి అతడికి తగిలింది. దీంతో ఫిజియో వచ్చి అతని చేతిపై స్ప్రే చేశాడు.
మరి సుందర్‌కి నేరుగా ఫైనల్ ఆడే అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. అతను మంచి ఆఫ్ స్పిన్నర్. అలాగే అద్భుతంగా బ్యాటింగ్ కూడా చేస్తాడు. శ్రీలంకలో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. టీమిండియాకు ఆఫ్ స్పిన్నర్ లేడు. ఇటువంటి పరిస్థితిలో సుందర్‌కు ఛాన్స్ ఇవ్వవచ్చు. అయితే, ఫైనల్‌లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమిండియా నిర్ణయించుకుంటేనే ఇది జరుగుతుంది. ఒకవేళ భారత్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగితే సుందర్ బెంచ్‌పైనే ఉండాల్సి వస్తుంది. అయితే, నేరుగా ఫైనల్ ఆడే ఛాన్స్ రాకపోవచ్చని భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..