AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: హీరోని చేసిన మైదానమే.. జీరోగా మార్చేసిందిగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి కోహ్లీ ఇలా..

IND vs AUS, Adelaide ODI: పెర్త్‌లో విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. తాజాగా అడిలైడ్‌లోనూ జీరే వద్ద అవుట్ అయ్యాడు. ఈ సిరీస్‌లో ఇది అతని వరుసగా రెండవ డకౌట్. కోహ్లీకి ఇది వరుసగా రెండవ డకౌట్. తనకు ఇష్టమైన మైదానంలో కూడా అతని వైఫల్యం ప్రశ్నలను లేవనెత్తుతుంది.

Video: హీరోని చేసిన మైదానమే.. జీరోగా మార్చేసిందిగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి కోహ్లీ ఇలా..
Virat Kohli
Venkata Chari
|

Updated on: Oct 23, 2025 | 10:11 AM

Share

IND vs AUS, Adelaide ODI: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) నిరాశ తప్పడం లేదు. అడిలైడ్ ఓవల్ వేదికగా గురువారం జరుగుతున్న రెండో వన్డేలో కూడా కోహ్లీ పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్‌గా (Duck Out) వెనుదిరిగాడు. తొలి వన్డేలో కూడా డకౌట్ అయిన విరాట్ కోహ్లీకి ఇది వన్డే కెరీర్‌లో వరుసగా రెండో డకౌట్ కావడం గమనార్హం.

సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీపై అభిమానులు, జట్టు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే, తొలి వన్డేలో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో డకౌట్ అయిన కోహ్లీ, రెండో వన్డేలోనూ అదే వైఫల్యాన్ని కొనసాగించాడు.

ఇవి కూడా చదవండి

బార్ట్‌లెట్ మాయాజాలం: డకౌట్‌గా కోహ్లీ..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియాకు ఆదిలోనే షాక్‌లు తగిలాయి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (9 పరుగులు) త్వరగా ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ నుంచి పెద్ద ఇన్నింగ్స్ ఆశించారు. కానీ, ఆస్ట్రేలియా పేసర్ జేవియర్ బార్ట్‌లెట్ (Xavier Bartlett) వేసిన అద్భుతమైన బంతికి కోహ్లీ బోల్తా కొట్టాడు.

బార్ట్‌లెట్ బౌలింగ్‌లో కోహ్లీ కేవలం 4 బంతులు మాత్రమే ఎదుర్కొని ఎల్బీడబ్ల్యూ (LBW) అయ్యాడు. కోహ్లీ రివ్యూ (DRS) కూడా తీసుకోకుండానే పెవిలియన్ దారి పట్టాడు. దీంతో 17 పరుగులకే టీమ్ ఇండియా రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

తొలిసారి వరుస డకౌట్‌లు:

వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి ఇది 18వ డకౌట్. అయితే, తన సుదీర్ఘ కెరీర్‌లో వరుసగా రెండు వన్డే ఇన్నింగ్స్‌లలో డకౌట్ కావడం కోహ్లీకి ఇదే మొదటిసారి కావడం అభిమానులను కలవరపెడుతోంది. అంతకుముందు, పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో 8 బంతులు ఎదుర్కొని డకౌట్ అయిన కోహ్లీ, ఈసారి కేవలం 4 బంతులకే పరిమితమయ్యాడు.

కోహ్లీ, రోహిత్ శర్మ (తొలి వన్డేలో 8 పరుగులు) వంటి సీనియర్ ఆటగాళ్లు పునరాగమనం చేసిన ఈ సిరీస్‌లో ఇలాంటి నిరాశజనక ప్రదర్శన చేయడంపై క్రికెట్ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెస్టులు, టీ20లకు ఇప్పటికే వీడ్కోలు పలికిన ఈ స్టార్ ఆటగాళ్లకు ఈ వన్డే సిరీస్ చాలా కీలకం. సిరీస్‌ను సమం చేయాలంటే టీమ్ ఇండియాకు ఈ రెండో వన్డేలో విజయం అత్యవసరం. ఈ క్లిష్ట సమయంలో కింగ్ కోహ్లీ ఇలా విఫలం కావడం జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ