- Telugu News Sports News Cricket news Team india player shardul thakur wife mithali parulkar bakery business
భర్త టీమిండియా స్టార్ క్రికెటర్.. కట్‌చేస్తే.. భార్య బేకరీలో.. ఆదాయం తెలిస్తే కళ్లు గిర్రున తిరగాల్సిందే
Shardul Thakur’s Wife Mithali Parulkar’s Bakery Business: టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ పేరు క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. అయితే ఆయన భార్య మిథాలీ పారుల్కర్ కూడా వ్యాపార ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. క్రికెటర్ భార్యగా కాకుండా, ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా మిథాలీ పారుల్కర్ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది.
Updated on: Aug 15, 2025 | 11:11 AM

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో క్రికెట్ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. కానీ, ఆయన వ్యక్తిగత జీవితంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన వ్యక్తి ఆయన భార్య మిథాలి పరుల్కర్. క్రికెట్ ప్రపంచం వెలుపల, మిథాలి తన సొంత గుర్తింపును ఒక యంగ్ ఎంట్రప్రెన్యూర్‌గా నిలబెట్టుకుంది.

మిథాలి "ఆల్ ద జాజ్ – లగ్జరీ బేకరీ" అనే బేకరీ బ్రాండ్‌ను స్థాపించి, రుచికరమైన కేకులు, పేస్ట్రీలు, డెజర్ట్స్ తయారీలో ప్రత్యేకత సాధించింది. పుణేలో మొదలైన ఈ వ్యాపారం, ఇప్పుడు పెద్ద స్థాయిలో విస్తరిస్తోంది. ఆమె బేకరీ ఉత్పత్తులు నాణ్యత, సృజనాత్మకత, ప్రత్యేకమైన రుచుల కోసం ప్రసిద్ధి చెందాయి.

తన భర్త శార్దూల్ క్రికెట్ మైదానంలో విజయం సాధిస్తున్నప్పుడు, మిథాలి వ్యాపార రంగంలో తన ప్రతిభతో విజయాలు సాధిస్తూ, ఒక పవర్ కపుల్‌గా ఇద్దరూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మిథాలి కథ, యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. కష్టపడి పని చేస్తే ఏ రంగంలోనైనా విజయాన్ని అందుకోవచ్చని నిరూపిస్తుంది.

భర్తకు పేరు, ఆదాయం ఉన్నప్పటికీ, మిథాలీ సొంతంగా వ్యాపారం చేసుకుంటుంది. దాని ద్వారా ఆమె నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తుంది. దీంతో ఆమె దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయల నికర విలువను సంపాదిస్తోంది. దీనికి ముందు, మిథాలీ ఒక కంపెనీలో కంపెనీ సెక్రటరీగా పనిచేసింది.

1992 లో ముంబైలో జన్మించిన మిథాలీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. మిథాలీ తండ్రి పెద్ద వ్యాపారవేత్త. మిథాలీ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దాదాపు 70.5 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె శార్దూల్ ఠాకూర్‌తో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూనే ఉంటుంది.




