Team India : బర్మింగ్‌హామ్‌లో పాత రికార్డులను టీంఇండియా తిరగరాస్తుందా ? 18 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టేస్తారా?
భారత జట్టు ఇంగ్లాండ్‌లో తమ అత్యధిక టెస్ట్ స్కోరు రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎడ్జ్‌బాస్టన్‌లో శుభమాన్ గిల్ డబుల్ సెంచరీతో రాణించాడు. 269పరుగులు సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. టీమిండియా 600 పరుగుల మార్కును దాటింది.

Team India : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ బుధవారం నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండో రోజు గురువారం టీ టైంకు 550 పరుగుల మార్కును చేరుకుంది. భారత జట్టు ఈ ఇన్నింగ్స్‌లో 600 పరుగుల మార్కును కూడా దాటే అవకాశం కనిపిస్తుంది. టీమిండియా ఇంగ్లాండ్‌లో కేవలం మూడుసార్లు మాత్రమే 600 పరుగుల మార్కును దాటింది. భారత జట్టు ఇంగ్లాండ్‌లో తమ అత్యధిక స్కోరును 2007లో ఓవల్ మైదానంలో నమోదు చేసింది.
భారత జట్టు 2007లో ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్‌లో అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో భారత జట్టు 664 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తరపున దినేష్ కార్తీక్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, ఎంఎస్ ధోని అద్భుతమైన హాఫ్ సెంచరీలు సాధించారు. ఇక అనిల్ కుంబ్లే ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. దీని కారణంగానే భారత్ ఇంత పెద్ద స్కోరును నమోదు చేయగలిగింది. ఇంగ్లాండ్‌లో భారత్ సాధించిన రెండో అత్యధిక స్కోరు లీడ్స్ మైదానంలో 628 పరుగులు. ఇక మూడో అత్యధిక స్కోరు ఓవల్ మైదానంలోనే 606 పరుగులు చేసింది టీంఇండియా.
ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టిస్తుందా? భారత జట్టు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు టీ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసింది. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో చరిత్ర సృష్టించే అవకాశం టీం ఇండియాకు ఉంది. భారత జట్టు మరో 101 పరుగులు చేయగలిగితే, ఇంగ్లాండ్‌లో తమ అత్యధిక స్కోరు రికార్డును బద్దలు కొట్టవచ్చు. ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్ శుభమాన్ గిల్ 269 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఈ రికార్డును బద్దలు కొట్టడం భారత జట్టుకు ఒక పెద్ద మైలురాయి అవుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..