Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ishan Kishan : హర్భజన్ సింగ్‌ను ఇమిటెట్ చేసిన ఈశాన్ కిషన్.. వీడియో వైరల్!

ఇషాన్ కిషన్ కౌంటీ క్రికెట్‌లో సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ స్టైల్‌లో బౌలింగ్ చేస్తూ ఒక్క పరుగే ఇచ్చాడు. అతని బ్యాటింగ్ ప్రదర్శన కూడా అద్భుతం. సెంచరీ మిస్ అయినా చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. బజ్జీని ఇమిటేట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.

Ishan Kishan : హర్భజన్ సింగ్‌ను ఇమిటెట్ చేసిన ఈశాన్ కిషన్.. వీడియో వైరల్!
Ishan Kishan
Lohith Kumar
|

Updated on: Jul 03, 2025 | 9:34 PM

Share

Ishan Kishan : భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నాటింగ్‌హామ్‌షైర్ తరపున ఆడుతున్నాడు. తను ఇటీవల అద్భుతమైన బ్యాటింగ్, వికెట్ కీపింగ్ తో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఈసారి తను తన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అక్కడ అతను భారత దిగ్గజ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ ను ఇమిటేట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇషాన్ కు నాటింగ్‌హామ్‌షైర్ వర్సెస్ సోమర్‌సెట్ మ్యాచ్‌లో బౌలింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. అప్పటికే మ్యాచ్ డ్రా అవుతుందని తేలిపోయింది. మ్యాచ్ చివరి ఓవర్ వేయడానికి ఇషాన్ కు అవకాశం దక్కింది. ఇషాన్ మొదటి నాలుగు బంతులను ఆఫ్ స్పిన్ వేశాడు. ఈ క్రమంలో తను హర్భజన్ సింగ్ యాక్షన్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఆ తర్వాత అతను సైడ్ మార్చి, లెగ్ స్పిన్ కూడా వేశాడు. ఇషాన్ ఆ ఓవర్‌లో కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు.

రెండు జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. సోమర్‌సెట్ మొదటి ఇన్నింగ్స్‌లో 379 పరుగులు చేసింది. దానికి సమాధానంగా నాటింగ్‌హామ్‌షైర్ మొదటి ఇన్నింగ్స్‌లో 509 పరుగులు చేసింది. ఆ తర్వాత సోమర్‌సెట్ తమ రెండో ఇన్నింగ్స్‌లో చివరి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది.

కౌంటీ క్రికెట్‌లో ఇషాన్ కు ఇది రెండో మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఇషాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇషాన్ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. ఇషాన్ 77 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 8 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. దీనికి ముందు ఇషాన్ తన కౌంటీ అరంగేట్రంలో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను యార్క్‌షైర్‌పై కేవలం 98 బంతుల్లో 87 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఈశాన్ 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో