Team India World Cup Jersey: సోషల్ మీడియాలో లీకైన టీమిండియా వరల్డ్ కప్ జెర్సీ.. ఆ రెండు నక్షత్రాల కథేంటో తెలుసా?
Team India Jersey: ప్రపంచకప్‌లో టీమిండియా ఎలాంటి ప్రత్యేక జెర్సీని ధరించబోతోంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫొటో వైరల్ అవుతోంది. అందులో బీసీసీఐ లోగో కనిపిస్తుంది. ఈ లోగో పైన రెండు నక్షత్రాలు ఉన్నాయి. టీమ్ ఇండియా అధికారిక ప్రపంచకప్ జెర్సీ ఇంకా విడుదల కానప్పటికీ, దాని సంగ్రహావలోకనం వైరల్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జెర్సీపై రెండు స్టార్లు ఎందుకు ఉన్నాయంటూ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకంటే ఆసియా కప్‌లో భారత జట్టు ధరించిన జెర్సీలో మూడు స్టార్లు ఉన్నాయి.
Team India World Cup Jersey: ప్రస్తుతం ఆసియా కప్ 2023లో బిజీగా ఉన్న టీమిండియా.. ఆ తర్వాత ప్రపంచకప్ ఆడాల్సి ఉంది. గత 10 ఏళ్లలో భారత జట్టు ఏ ఐసీసీ ట్రోఫీని గెలుచుకోలేదు. ఇటువంటి పరిస్థితిలో ఈసారి టీమ్ ఇండియా స్వదేశంలో ఈ టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టిస్తుందని భావిస్తున్నారు. ప్రపంచ కప్‌నకు ముందే, టీమ్ ఇండియా జెర్సీ సోషల్ మీడియాలో లీక్ అయింది. ఇందులో పెద్ద మార్పు కనిపించింది. టీమ్ ఇండియా జెర్సీలో ఆ ప్రత్యేకత ఏమిలో ఇప్పుడు చూద్దాం..
టీమ్ ఇండియా జెర్సీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో బీసీసీఐ లోగో కనిపిస్తుంది. ఈ లోగో పైన రెండు నక్షత్రాలు ఉన్నాయి. టీమ్ ఇండియా అధికారిక ప్రపంచకప్ జెర్సీ ఇంకా విడుదల కానప్పటికీ, దాని సంగ్రహావలోకనం వైరల్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జెర్సీపై రెండు స్టార్లు ఎందుకు ఉన్నాయంటూ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకంటే ఆసియా కప్‌లో భారత జట్టు ధరించిన జెర్సీలో మూడు స్టార్లు ఉన్నాయి.
టీమిండియా ICC 50 ఓవర్ల వరల్డ్ కప్ ఆడనుంది. ఇప్పటివరకు భారత్ రెండు వన్డే ప్రపంచ కప్‌లను మాత్రమే గెలుచుకుంది. ఒకటి 1983లో, మరొకటి 2011లో. ఈ క్రమంలో రెండు స్టార్స్‌ను జెర్సీలపై ఉంచినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం టీమిండియా జెర్సీపై ఉన్న మూడో స్టార్ టీ-20 వరల్డ్ కప్ 2007కి జత చేశారు. వన్డే ప్రపంచకప్ అనేది ICC అధికారిక కార్యక్రమం అయినందున, వన్డే ప్రపంచకప్‌తో సంబంధం ఉన్న స్టార్‌లను మాత్రమే ధరించి టీమిండియా బరిలోకి దిగనుంది.
టీమిండియా జెర్సీ ఫొటో..
Should India's new jersey have 3 stars instead of 2?Leaked jersey sparks furore, fans say it's disrespectful to not include 3 stars for World Cup wins.#leakedjersey #worldcup #indiajersey #cricket pic.twitter.com/jzBXIfXKkh
— Crickdom (@Crickdom7) September 15, 2023
వన్డే ప్రపంచ కప్ 2023 గురించి మాట్లాడితే, ఈ టోర్నమెంట్ ఈసారి భారతదేశంలో జరుగుతుంది. ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానుండగా, భారత్ తొలి మ్యాచ్ అక్టోబర్ 8న జరగనుంది. క్వార్టర్-ఫైనల్ రేసుకు ముందు, టీమిండియా మొత్తం 9 లీగ్ మ్యాచ్‌లు ఆడవలసి ఉంటుంది. మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఉంటుంది. ఈ సమయంలో టీమిండియా పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో కూడా పోటీపడుతుంది.
ప్రస్తుతం టీమిండియా ఆసియాకప్ 2023లో బంగ్లాదేశ్ జట్టుతో సూపర్ 4లో చివరి మ్యాచ్ ఆడుతోంది. అలాగే ఆదివారం నాడు ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకను ఢీకొట్టనుంది.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్(w), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ.
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిటన్ దాస్ (వికెట్ కీపర్), తంజీద్ హసన్ తమీమ్, అన్ముల్ హక్, తౌహీద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, మెహిదీ హసన్ షేక్, నసుమ్ అహ్మద్, తంజీద్ హసన్ షకీబ్, ముష్తాఫిజుర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..