Glenn Maxwell: తండ్రైన ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్.. ఫొటో షేర్ చేైస్తూ.. పేరును ప్రకటించిన గ్లెన్ మాక్స్‌వెల్ దంపతులు..

Glenn Maxwell - Vini Raman: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఇంటికి కొత్త అతిథి వచ్చాడు. మాక్స్‌వెల్ భార్య వినీ రామన్ మగబిడ్డకు జన్మనిచ్చింది. విని రామన్, గ్లెన్ మాక్స్‌వెల్ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలలో తమ కొడుకుతో ఉన్న ఫొటోను పంచుకుని, ఈ గుడ్ న్యూస్ అందించారు. కాగా, గ్లెన్ ఇప్పుడు వన్డే ప్రపంచకప్ ద్వారా ఆసీస్ జట్టులో కనిపించనున్నాడు. వన్డే ప్రపంచకప్ వచ్చే నెల 5 నుంచి భారత్‌లో మొదలు కానుంది. ఈ మేరకు అన్ని జట్టు ఇప్పటికే తమ స్వ్కాడ్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Glenn Maxwell: తండ్రైన ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్.. ఫొటో షేర్ చేైస్తూ.. పేరును ప్రకటించిన గ్లెన్ మాక్స్‌వెల్ దంపతులు..
Maxwell Vini Raman
Follow us
Venkata Chari

|

Updated on: Sep 15, 2023 | 8:26 PM

Glenn Maxwell – Vini Raman: ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell) ఇంటికి కొత్త అతిథి వచ్చాడు. మ్యాక్స్‌వెల్ భార్య వినీ రామన్ (Vini Raman) మగబిడ్డకు జన్మనిచ్చింది. విని రామన్, గ్లెన్ మాక్స్‌వెల్ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలలో తమ కొడుకుతో ఉన్న ఫొటోను పంచుకుంటూ ఈ గుడ్‌న్యూస్‌ను తమ అభిమానులతో పంచుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, వినీ రామన్ తన కొడుకు పేరును కూడా పంచుకుంది. ఈ జంట తమ కొడుకుకు లోగాన్ మావెరిక్ మాక్స్‌వెల్ అని పేరు పెట్టారు.

మగబిడ్డతో ఆనందంలో మాక్స్‌వెల్ జంట..

సెప్టెంబర్ 11 న, మాక్స్వెల్ భార్య విని రామన్ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్ న్యూస్ తర్వాత, ఈ జంట సోషల్ మీడియాలో అభినందనలతో ముంచెత్తారు. మే నెలలో విని రామన్ తన బిడ్డ త్వరలో ఇంటికి రానుందని తెలిపింది. అలాగే జులై నెలలో విని రామన్‌కు హిందూ సంప్రదాయం ప్రకారం సీమంతం చేశారు.

ఇవి కూడా చదవండి

భారత సంతతికి చెందిన వినీ రామన్..

గ్లెన్ మాక్స్‌వెల్ భార్య వినీ రామన్ భారతీయ సంతతికి చెందినవారనే సంగతి తెలిసిందే. ఆమె ఆస్ట్రేలియాలో జన్మించింది. విని తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. విని మెడికల్ సైన్స్ చదివి వృత్తి రీత్యా ఫార్మసిస్ట్‌గా పనిచేస్తుంది. 2019లో తొలిసారిగా కలిసిన విని రామన్, గ్లెన్ మాక్స్‌వెల్‌లు మార్చి 18, 2022న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం, మార్చి 27, 2022న తమిళ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.

జట్టులోకి మాక్స్‌వెల్ రీఎంట్రీ..

View this post on Instagram

A post shared by Vini Maxwell (@vini.raman)

ఈ ఏడాది మార్చిలో వాంఖడే వేదికగా భారత్‌తో జరిగిన వన్డేలో ఆడిన మ్యాక్స్‌వెల్ ఆ తర్వాత ఆస్ట్రేలియా తరపున ఆడలేదు. గతేడాది నవంబర్‌లో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలో మాక్స్‌వెల్‌కు కాలు విరిగింది. ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్న గ్లెన్ ఇప్పుడు వన్డే ప్రపంచకప్ ద్వారా ఆసీస్ జట్టులో కనిపించనున్నాడు. వన్డే ప్రపంచకప్ వచ్చే నెల 5 నుంచి భారత్‌లో మొదలు కానుంది. ఈ మేరకు అన్ని జట్టు ఇప్పటికే తమ స్వ్కాడ్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే.

గ్లెన్ మాక్స్‌వెల్ – వినీ రామన్‌ల వివాహం:

View this post on Instagram

A post shared by Vini Maxwell (@vini.raman)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.