Team India: టీమిండియా వరల్డ్ కప్ స్వ్కాడ్‌లో మార్పు రానుందా? వైట్‌బాల్‌తో ప్రాక్టీస్ షురూ చేసిన స్టార్ ప్లేయర్..
Ravi Ashwin: రవి అశ్విన్ ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ నేను గత 14 నుంచి 15 సంవత్సరాలుగా భారత జట్టు తరపున ఆడుతున్నాను. ఈ సమయంలో నేను మంచి, చెడు సమయాలను చూశాను. భారత క్రికెట్ ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. జట్టుకు ఎప్పుడైనా నా అవసరం ఉంటే, నా 100 శాతం ఇవ్వడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. 2011లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత జట్టు వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ సమయంలో అశ్విన్ కూడా జట్టులో భాగంగా ఉన్నాడు.
Ravi Ashwin: వన్డే ప్రపంచ కప్ 2023 కోసం టీమ్ ఇండియాలోని 15 మంది ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన తెలిసిందే. అనుభవజ్ఞుడైన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరు అందులో లేదు. కాగా, ప్రస్తుతం అశ్విన్ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో తెల్ల బంతితో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సమయంలో, అతనితో పాటు NCA హెడ్ VVS లక్ష్మణ్, NCA స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులే కూడా అక్కడ కనిపించారు.
రవిచంద్రన్ అశ్విన్ గతేడాది టీ20 ప్రపంచకప్‌లో వైట్ బాల్ క్రికెట్‌లో భారత జట్టు తరపున తన చివరి మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి పరిమిత ఓవర్ల జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అశ్విన్ హోమ్ పిచ్‌లపై బంతితో ఎంతో ఉపయోగపడతాడని అందరూ ఊహించారు.
నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి..
సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో పాటు, అశ్విన్ నాకు అద్భుతమైన రోజు అంటూ రాసుకొచ్చాడు. మీరు నిరంతరం కొత్త ఏదో నేర్చుకోవాలి. అది కూడా ఒక నైపుణ్యం. వీవీఎస్ లక్ష్మణ్, సాయిరాజ్ బహుతులేలకు ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చాడు.
ఎల్లప్పుడూ జట్టు కోసం సిద్ధంగా ఉంటాను..
My kinda day 🤩🤩.
The capacity to learn is a gift.The ability to learn is a skill. However, the willingness to learn is a CHOICE. #cricketlife Thank you for the help @SairajBahutule @VVSLaxman281 pic.twitter.com/4nK7V5IthS
— Ashwin 🇮🇳 (@ashwinravi99) September 15, 2023
రవి అశ్విన్ ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ నేను గత 14 నుంచి 15 సంవత్సరాలుగా భారత జట్టు తరపున ఆడుతున్నాను. ఈ సమయంలో నేను మంచి, చెడు సమయాలను చూశాను. భారత క్రికెట్ ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. జట్టుకు ఎప్పుడైనా నా అవసరం ఉంటే, నా 100 శాతం ఇవ్వడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. 2011లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత జట్టు వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ సమయంలో అశ్విన్ కూడా జట్టులో భాగంగా ఉన్నాడు.
వన్డే ప్రపంచ కప్ 2023 భారత్ వేదికగా వచ్చే నెల 5 నుంచి మొదలుకానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ జట్లను ప్రకటించాయి. అయితే, ఇందులో కొన్ని మార్పులు చేసే అవకాశం కూడా ఉంది.
ప్రపంచ కప్ 2023లో పాల్గొనే భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ , సూర్యకుమార్ యాదవ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..