‘అంకుల్ మానాన్న చాలా సీరియస్.. ఇంట్లో నుంచి తీసుకెళ్లండి’: ద్రవిడ్ కుమారుడు ఫోన్ చేస్తేనే ఈ ఆఫర్ ఇచ్చామన్న గంగూలీ

Sourav Ganguly: రాహుల్ ద్రవిడ్ కొన్ని సంవత్సరాలుగా భారతదేశం ఏ, అండర్-19 జట్లకు కోచ్‌గా విజయవంతమైన సంగతి తెలిసిందే.

'అంకుల్ మానాన్న చాలా సీరియస్.. ఇంట్లో నుంచి తీసుకెళ్లండి': ద్రవిడ్ కుమారుడు ఫోన్ చేస్తేనే ఈ ఆఫర్ ఇచ్చామన్న గంగూలీ
Rahul Dravid Sourav Ganguly
Follow us
Venkata Chari

|

Updated on: Nov 14, 2021 | 5:17 PM

Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెచ్ కోచ్‌గా నియమితుడయ్యాడని తెలిసిందే. టీ20 ప్రపంచ కప్‌ 2021లో భారత్‌ పేలవ ప్రదర్శన తరువాత రవిశాస్త్రి భారత కోచ్‌గా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాతే ద్రవిడ్ టీమిండియా పగ్గాలు చేపట్టాడు. ద్రవిడ్ అత్యుత్తమ బ్యాటర్‌లలో ఒకడిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం భారత కోచ్‌గా నియామకం కావడంతో ద్రవిడ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ద్రవిడ్ కొన్ని సంవత్సరాలుగా భారత్ ఏ, అండర్-19 జట్లకు కోచ్‌గా పనిచేసి, విజయవంతమైన కోచ్‌గా పేరుగాంచాడు. అయితే నవంబర్ 17న ప్రారంభమయ్యే న్యూజిలాండ్ సిరీస్‌‌లో టీమిండియా హెడ్‌కోచ్‌గా తొలిసారి తన బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ద్రవిడ్ హెడ్‌కోచ్‌గా చాలా కఠినంగా ఉంటాడని చాలాసార్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ద్రవిడ్ సిరీయస్‌ నెస్‌ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చమత్కించాడు. ద్రవిడ్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నందున దిగ్గజ క్రికెటర్‌ను ఇంటికి దూరంగా ఉంచాలనుకుంటున్నాడని ద్రవిడ్ కుమారుడు కోరుకుంటాడని సౌరవ్ గంగూలీ చమత్కరించారు.

అందుకే ద్రవిడ్‌ను టీమిండియా హెడ్‌కోచ్‌గా చేశామంటూ గంగూలీ చెప్పుకొచ్చారు. “ద్రవిడ్ చాలా కఠినంగా ఉన్నాడని, అయన్ను తీసుకెళ్లాలని ద్రవిడ్ కుమారుడు నాకు కాల్ చేశాడు. అప్పుడే రాహుల్ ద్రవిడ్‌కి ఫోన్ చేసి జాతీయ జట్టులో చేరాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాను’ అని గంగూలీ పేర్కొన్నారు. శనివారం (నవంబర్ 13) 40వ షార్జా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో బీసీసీఐ అధ్యక్షుడు పలు విషయాలు పంచుకున్నారు. కొన్నేళ్లుగా తమ స్నేహం చెక్కుచెదరకుండా సాగుతోందని ఆయన అన్నారు.

“మేం కలిసి పెరిగాం, అదే సమయంలో క్రికెట్ ఆడడం కూడా ఒకేసారి ప్రారంభించాం. ఎక్కువ సమయం కలిసి టీమిండియాతో జర్నీచేశాం. అందుకే మాలో చాలామందికి ద్రవిడ్‌ను హెడ్‌కోచ్‌గా చేయాలని కోరుకున్నామని పేర్కొన్నారు. భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల పునఃప్రారంభం గురించి గంగూలీని ప్రశ్నించినప్పుడు, దానిపై బీసీసీఐ లేదా పీసీబీకి ఎలాంటి నియంత్రణ లేదని తెలిపారు.

“ఈ విషయం బోర్డుల చేతుల్లో లేదు. ప్రపంచ టోర్నమెంట్లలో, రెండు జట్లు ఒకదానికొకటి తలపడతాయి. ఏళ్ల తరబడి ద్వైపాక్షిక క్రికెట్ ఆగిపోయిందని, దీనిపై ఆయా ప్రభుత్వాలు కృషి చేయాల్సి ఉందన్నారు. ఇది రమీజ్ చేతిలోనో, నా చేతుల్లోనో లేదు’ అని బీసీసీఐ అధ్యక్షుడు తేల్చి చెప్పారు.

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ 2021 లో పేలవ ప్రదర్శనతో తన ప్రయాణాన్ని ముగించుకుంది. అయితే ఇదే టోర్నీలో కివీస్‌పై టీమ్ ఇండియా ఘోర పరాజయం పాలైంది. దీంతో ప్రస్తుతం స్వదేశంలో జరిగే న్యూజిలాండ్ సిరీస్‌‌లో రోహిత్ శర్మ సారధ్యంలో ఎలా రాణిస్తుందోనని అంతా ఎదురుచూస్తున్నారు.

Also Read: WBBLలో ఇండియన్ బ్యాటర్ తుఫాన్ ఇన్నింగ్స్.. 39 బంతుల్లోనే ప్రత్యర్థులకు చుక్కలు..!

VVS Laxman: ఎన్‌సీఏ హెడ్‎గా వీవీఎస్ లక్ష్మణ్.. ధృవీకరించిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ..!