Gautam Gambhir: కరోనా బారిన గౌతమ్ గంభీర్.. సోషల్ మీడియాలో ప్రకటన..!
గౌతమ్ గంభీర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేస్తూ విషయాన్ని ప్రకటించాడు.
Gautam Gambhir Corona Positive: టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ నేత గౌతమ్ గంభీర్‌కు కరోనా సోకింది. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. గంభీర్ ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. 40 ఏళ్ల గంభీర్‌కు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది.
‘నేను తేలికపాటి లక్షణాల తర్వాత కరోనా పాజిటివ్‌గా తేలింది. నాతో పరిచయం ఉన్న వ్యక్తులందరూ, కోవిడ్ టెస్ట్ చేసుకుని, సురక్షితంగా ఉండండి’ అంటూ ట్వీట్ చేశాడు. గౌతమ్ గంభీర్ తూర్పు ఢిల్లీ నుంచి లోక్‌సభ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. అలాగే కొత్త IPL జట్టు లక్నో సూపర్‌జెయింట్స్‌కు మెంటార్‌గా కూడా ఉన్నాడు. గౌతమ్ గంభీర్ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరయ్యాడు. గంభీర్ భారత్ తరఫున 54 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. 2007, 2011 ప్రపంచ కప్‌లను గెలుచుకున్న జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
గంభీర్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. ఆయన తూర్పు ఢిల్లీ నుంచి ఎంపీగా విజయం సాధించాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అతని కెప్టెన్సీలో, KKR 2012, 2014లో ఛాంపియన్‌గా నిలిచింది.
After experiencing mild symptoms, I tested positive for COVID today. Requesting everyone who came into my contact to get themselves tested. #StaySafe
— Gautam Gambhir (@GautamGambhir) January 25, 2022
Also Read: IPL 2022: సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చిన దక్షిణాఫ్రికా.. అప్పటి వరకు ఆగాలన్న బీసీసీఐ
IND vs WI: వెస్టిండీస్‌తో పోరుకు టీమిండియాలో కీలక మార్పులు.. ఈ వారంలో జట్టు ప్రకటన..!