AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చిన దక్షిణాఫ్రికా.. అప్పటి వరకు ఆగాలన్న బీసీసీఐ

BCCI భారతదేశంలోనే IPL 2022ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. కానీ, అప్పటికి పరిస్థితులు మారితే మాత్రం రెండో ఎంపికగా దక్షిణాఫ్రికాను ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది.

IPL 2022: సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చిన దక్షిణాఫ్రికా.. అప్పటి వరకు ఆగాలన్న బీసీసీఐ
Ipl 2022
Venkata Chari
|

Updated on: Jan 25, 2022 | 11:09 AM

Share

IPL 2022: ఐపీఎల్ 2022 (IPL 2022) వేదికగా దక్షిణాఫ్రికా పేరు వినిపిస్తోంది. అయితే రెండవ ఎంపికగా ముందంజలో ఉందని పలు వార్తలు వినిస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ కూడా తన ఉద్దేశాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రికెట్ సౌతాఫ్రికా కూడా బీసీసీఐ (BCCI) ముందు లీగ్ నిర్వహించే ప్రణాళికను ముందుకు తెచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికా పూర్తి ఉత్సాహంతో IPL 2022ని నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉంది. అయితే భారత్‌లో టోర్నీ నిర్వహించే అవకాశాలు లేనప్పుడు మాత్రమే అక్కడ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అందుకే తుది వేదికపై నిర్ణయం తీసుకోవడానికి బీసీసీఐ ఫిబ్రవరి 20 వరకు సమయం తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఫిబ్రవరి 20కి ముందు ఏం జరగనుంది.. IPL 2022 మెగా వేలం ఫిబ్రవరిలో ముగుస్తుంది. అంటే, మొత్తం 10 జట్లు తమ మొత్తం టీమ్ ఫోర్స్‌తో కనిపిస్తాయి. అంటే ఏ ఆటగాడు ఏ జట్టులో ఉన్నాడో కచ్చితంగా తెలుస్తోంది. దీంతో పాటు, మెగా వేలం నిర్వహణపై కరోనా ఎలాంటి ప్రభావం చూపనుందో కూడా తెలియనుంది.

CSA ప్రణాళికలో ఏముంది? అయితే, ప్రస్తుతం క్రికెట్ సౌతాఫ్రికా తయారు చేసిన ప్రతిపాదనలో అసలేముంది? ఇన్‌సైడ్‌స్పోర్ట్ క్రిక్‌బజ్‌ ప్రకారం క్రికెట్ సౌత్ ఆఫ్రికా చాలా తక్కువ డబ్బుతో టోర్నమెంట్‌ను నిర్వహిస్తుందని పేర్కొంది. దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ నిర్వహించడం వల్ల విమాన ప్రయాణం, హోటళ్లు, ఇతర సౌకర్యాలపై పెద్దగా ఖర్చు ఉండదు. జోహన్నెస్‌బర్గ్, చుట్టుపక్కల 4 వేదికలలో లీగ్ నిర్వహించేందుకు దక్షిణాఫ్రికా ఏర్పాట్లు చేస్తుందని పేర్కొంది. చాలా మ్యాచ్‌లు జోహన్నెస్‌బర్గ్‌లో జరగనున్నాయి. అదే కాకుండా సెంచూరియన్, విల్లోమూర్, సెన్వెస్ క్రికెట్ స్టేడియంలలో కొన్ని మ్యాచ్‌లు జరుగుతాయని తెలిపింది.

ఫిబ్రవరి 20న తుది వేదికపై నిర్ణయం.. అయితే తాజా పరిస్థితి మేరకు.. ఐపీఎల్ 2022ని భారత్‌లోనే నిర్వహించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. పరిస్థితులు మారితే దాని కారణంగా ప్రణాళికను మార్చవలసి వస్తే, దక్షిణాఫ్రికాను వేదిక ఎంపిక చేయనుందని తెలుస్తోంది. గత శనివారం నాటి సమావేశం తర్వాత, ఫిబ్రవరి 20 నాటికి వేదికపై తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు తెలిపింది.

ఐపీఎల్ 2022 మార్చి చివరి వారం నుంచి జరుగుతుందని బీసీసీఐ సెక్రటరీ జైషా ఇప్పటికే తెలిపారు. మార్చి 27 నుంచి మ్యాచులు ప్రారభమయ్యే అవకాశం ఉంది. ఈ లీగ్ మే వరకు కొనసాగుతుంది. భారత్‌లో కరోనా ముప్పు పొంచి ఉంది. అయినప్పటికీ, చాలా మంది ఫ్రాంచైజీ యజమానులు ఈ ఈవెంట్‌ను భారతదేశంలోనే నిర్వహించాలని కోరుతున్నారు. ముంబై, పుణెలోని ఖాళీ స్టేడియాల్లో టోర్నీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: IND vs WI: వెస్టిండీస్‌తో పోరుకు టీమిండియాలో కీలక మార్పులు.. ఈ వారంలో జట్టు ప్రకటన..!

Watch Video: చివరి ఓవర్లో హైడ్రామా.. హ్యాట్రిక్‌తో బౌలర్ దూకుడు.. 6 పరుగుల కోసం బ్యాటర్ల పోరు..!