నటితో ఎఫైర్ పెట్టుకుని, శరీరంపై టాటూలు వేసుకున్నేళ్లకే జట్టులో చోటిస్తారా.. భారత మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

S Badrinath Controversial Statement: జులై 22న టీమిండియా శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య 3 టీ20లు, 3 వన్డేలు జరగనున్నాయి. దీంతో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పదవీకాలం ప్రారంభం కానుంది. ఈ టూర్ కోసం ఇటీవలే టీమిండియాను ప్రకటించారు. జట్టును ఎన్నుకునేటప్పుడు, సెలెక్టర్లు చాలా పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. దానిపై భారత మాజీ క్రికెటర్లు తమ భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

నటితో ఎఫైర్ పెట్టుకుని, శరీరంపై టాటూలు వేసుకున్నేళ్లకే జట్టులో చోటిస్తారా.. భారత మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
Ind Vs Sl Squad
Follow us

|

Updated on: Jul 21, 2024 | 8:09 PM

S Badrinath Controversial Statement: జులై 22న టీమిండియా శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య 3 టీ20లు, 3 వన్డేలు జరగనున్నాయి. దీంతో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పదవీకాలం ప్రారంభం కానుంది. ఈ టూర్ కోసం ఇటీవలే టీమిండియాను ప్రకటించారు. జట్టును ఎన్నుకునేటప్పుడు, సెలెక్టర్లు చాలా పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. దానిపై భారత మాజీ క్రికెటర్లు తమ భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమించారు. కొంతమంది యువ ఆటగాళ్లు కూడా ఈ పర్యటనకు వెళ్తున్నారు. అయితే, ఈ జట్టు ఎంపికపై భారత మాజీ ఆటగాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

భారత మాజీ క్రికెటర్ షాకింగ్ ప్రకటన..

శ్రీలంక టూర్‌కు ఎంపికైన జట్లపై భారత మాజీ బ్యాట్స్‌మెన్ సుబ్రమణ్యం బద్రీనాథ్ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. వాస్తవానికి ఈ పర్యటనలో అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్‌లకు జట్టులో చోటు దక్కలేదు. కాగా, రింకూ సింగ్ టీ20 జట్టులో ఒక భాగం మాత్రమే. ఈ జట్టు ఎంపికపై ఎస్ బద్రీనాథ్ ఏమాత్రం సంతోషంగా లేడు. క్రిక్ ఇట్ విత్ బద్రీ యూట్యూబ్ ఛానెల్‌లో ఎస్ బద్రీనాథ్ మాట్లాడుతూ.. రింకు సింగ్, రుతురాజ్ గైక్వాడ్, ఇతర ఆటగాళ్లను భారత జట్టులో ఎంపిక చేయనప్పుడు, బ్యాడ్ ఇమేజ్ ఉన్న వ్యక్తినే ఎంచుకుంటారు. ఒక బాలీవుడ్ నటితో, మంచి మీడియా మేనేజర్‌తో రిలేషన్ షిప్‌లో ఉండేవాళ్లు, శరీరంపై టాటూలు వేయించుకునే వాళ్లే కావాలనుకుంటా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆయన ప్రకటన కాస్త వైరల్‌గా మారింది.

అద్భుత ప్రదర్శన తర్వాత కూడా గైక్వాడ్‌కు చోటు దక్కలేదు..

శ్రీలంకతో టీ20 సిరీస్‌లో టీమిండియా ఓపెనింగ్ జోడీగా శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లు బరిలోకి దిగనున్నారు. అయితే ఈ జట్టులో రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కలేదు. రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటివరకు టీమ్ ఇండియా తరపున 23 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో, గైక్వాడ్ 20 ఇన్నింగ్స్‌లలో 39.56 సగటుతో 633 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 143.53గా నిలిచింది. ఈ సమయంలో, అతను 4 అర్ధ సెంచరీలు, 1 సెంచరీని కూడా సాధించాడు. ఇటీవల, జింబాబ్వే పర్యటనలో, గైక్వాడ్ 4 మ్యాచ్‌లలో మూడు ఇన్నింగ్స్‌లలో 66.50 సగటుతో 133 పరుగులు చేశాడు. అయితే, ఇంత బలమైన ప్రదర్శన చేసినప్పటికీ జట్టులో చోటు కోల్పోయాడు.

ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతున్న గంభీర్..

ఈ రోజుల్లో టీమ్ ఇండియా ఎంపికపై చాలా చర్చలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరి మనసులో రకరకాల ప్రశ్నలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గౌతమ్ గంభీర్ మాత్రమే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. వాస్తవానికి, జులై 22న శ్రీలంకకు బయలుదేరే ముందు, గౌతమ్ గంభీర్ విలేకరుల సమావేశం నిర్వహించనున్నాడు. అక్కడ అతను ఈ ప్రశ్నలన్నింటినీ ఎదుర్కొంటాడు. గౌతమ్ గంభీర్‌తో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా విలేకరుల సమావేశంలో పాల్గొంటారు.

మరిన్న క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..