Ind vs Aus: ప్చ్! బుమ్రా ఒక్కడినే నమ్మకుంటే కష్టమే.. ఆ స్టార్ ప్లేయర్‌ను దింపాల్సిందే..
అడిలైడ్‌లో ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ షమీ టీమ్‌లో రావడంపై స్పందించాడు.
పెర్త్ టెస్టులో విజయం సాధించిన టీమిండియా.. తాజాగా అడిలైడ్ టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అడిలైడ్లో టీమ్ ఇండియా బ్యాటింగ్ వైఫల్యం ఓటమికి ప్రధాన కారణమైనప్పటికీ.. బౌలర్లకు కూడా అంతగా రాణించలేకపోయారు. జట్టులో జస్ప్రీత్ బుమ్రా మాత్రమే తన అనుభవాన్ని ఉపయోగించుకోగా, మహ్మద్ సిరాజ్ నిలకడ లేమి ప్రదర్శన కనిపించింది. కానీ యువ పేసర్ హర్షిత్ రానా పూర్తిగా విఫలమైయ్యాడు. దీంతో అనుభవజ్ఞుడైన పేసర్ లేని లోటు రెండో టెస్టులో స్పష్టంగా కనిపించింది. తాజాగా టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ టీమ్ ఇండియాలో చేరడంపై కెప్టెన్ రోహిత్ స్పందించాడు. గత రెండు రోజులుగా మహమ్మద్ షమీ భారత జట్టులో చేరబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఇరు జట్ల మధ్య జరిగే బాక్సింగ్ డే టెస్టులో షమీ జట్టు తరఫున ఆడవచ్చునని ప్రచారం జరుగుతుంది. షమీ అందుబాటులోకి వస్తాడనే సమాచారాన్ని ఇప్పటికే తెలిపిన రోహిత్.. అభిమానులకు మరింత సంతోషాన్ని ఇచ్చే ఒక్క వార్త చెప్పాడు.
బీసీసీఐ వైద్య బృందం షమీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, వారి సలహా మేరకు రానున్న రోజుల్లో టీమిండయా నిర్ణయం తీసుకుంటుందని రోహిత్ తెలిపాడు. షమీ పూర్తి ఫిట్‌గా వస్తే జట్టుకు, బౌలింగ్ విభాగానికి బలం చేకూరుతుందని హిట్ మ్యాన్ చెప్పాడు. దాదాపు ఏడాది పాటు క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉన్న షమీ గత నెలలో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడి జట్టులోకి వచ్చాడు. అప్పటి నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరుసగా 7 మ్యాచ్‌లు ఆడాడు. ఇక్కడ షమీ అత్యద్భుత ఆటతీరుతో జట్టును ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు చేర్చింది.
షమీ మూడో టెస్టులో ఆడటం దాదాపు అసాధ్యం అని అందరూ భావిస్తున్నారు. అయితే అతను ఎప్పుడు టీమిండియాలో ఎప్పుడు వస్తాడని క్రికెట్ అభిమానులు వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే అడిలైడ్‌లో ఓటమి తర్వాత, రోహిత్‌ను విలేకరుల సమావేశంలో దీని గురించి అడిగారు. దీనికి కెప్టెన్ రోహిత్ సమాధానమిచ్చాడు. సిరీస్ మధ్యలో షమీ జట్టులో చేరడానికి తలుపులు తెరిచే ఉన్నాయని తెలిపాడు. అయితే తనపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడానికి జట్టు ఇష్టపడడం లేదన్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్నప్పుడు షమీ మోకాలిలో వాపు వచ్చిందని రోహిత్ పేర్కొన్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి