Rohit Sharma Video: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు.. క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసిన హిట్‌మ్యాన్.. టాప్ 10 లిస్ట్ ఇదే..
Rohit Sharma breaks Chris Gayle Record: వెస్టిండీస్ తుఫాన్ ప్లేయర్ క్రిస్ గేల్ 553 సిక్సర్లు (551 ఇన్నింగ్స్‌లు) సాధించాడు. దీనిని రోహిత్ కేవలం 473 ఇన్నింగ్స్‌ల్లోనే అధిగమించాడు. రోహిత్ వన్డేల్లో షాహిద్ అఫ్రిది, గేల్ తర్వాత మూడవ స్థానంలో నిలిచాడు. అయితే T20Iలలో 182 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

Rohit Sharma breaks Chris Gayle Record: బుధవారం ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ICC ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లో రోహిత్ శర్మ రికార్డులు బద్దలు కొట్టాడు. సిక్సులు, ఫోర్లతో ఆఫ్గాన్ బౌలర్లకు దడ పుట్టించాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్‌ను అధిగమించి, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ప్లేయర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. భారత బ్యాటర్ రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో అత్యధిక అంతర్జాతీయ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు.
వెస్టిండీస్ తుఫాన్ ప్లేయర్ క్రిస్ గేల్ 553 సిక్సర్లు (551 ఇన్నింగ్స్‌లు) సాధించాడు. దీనిని రోహిత్ కేవలం 473 ఇన్నింగ్స్‌ల్లోనే అధిగమించాడు. రోహిత్ వన్డేల్లో షాహిద్ అఫ్రిది, గేల్ తర్వాత మూడవ స్థానంలో నిలిచాడు. అయితే T20Iలలో 182 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
టెస్టు క్రికెట్‌లో 77 సిక్సర్లతో భారత ఆటగాళ్లలో రోహిత్ మూడో అగ్రగామిగా నిలిచాడు. వీరేంద్ర సెహ్వాగ్ (91), ఎంఎస్ ధోనీ (78) తర్వాత నిలిచాడు.
View this post on Instagram
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్లు..
క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 553 సిక్సర్లు
రోహిత్ శర్మ (భారత్) – 551 సిక్సర్లు*
షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్) – 476 సిక్సర్లు
బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్) – 398 సిక్సర్లు
మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్) – 383 సిక్సర్లు
ఎంఎస్ ధోని (భారత్) – 359 సిక్సర్లు
సనత్ జయసూర్య (శ్రీలంక) – 352 సిక్సర్లు
ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్) – 346 సిక్సర్లు
ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) – 328 సిక్సర్లు
జోస్ బట్లర్ (ఇంగ్లండ్) – 312 సిక్సర్లు*
* – 2023లో యాక్టివ్‌గా ఉన్న ఆటగాళ్లు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








