Watch Video: దూకుడొద్దు.. ఇది టెస్ట్ క్రికెట్.. టీ20 కాదంటూ హైదరాబాదీ పేసర్ స్వీట్ వార్నింగ్.. ఎవరికో తెలుసా?

|

Dec 16, 2022 | 1:02 PM

IND vs BAN: చిట్టగాంగ్‌లో జరుగుతున్న టెస్ట్ రెండో రోజు మహ్మద్ సిరాజ్, లిట్టన్ దాస్ మధ్య ఆసక్తికర వాగ్వాదం చోటుచేసుకుంది.

Watch Video: దూకుడొద్దు.. ఇది  టెస్ట్ క్రికెట్.. టీ20 కాదంటూ హైదరాబాదీ పేసర్ స్వీట్ వార్నింగ్.. ఎవరికో తెలుసా?
Team India
Follow us on

భారత్-బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య చిట్టగాంగ్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో రెండవ రోజు ఆసక్తికర వాగ్వాదం చోటుచేసుకుంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో లిట్టన్ దాస్‌తో మహ్మద్ సిరాజ్ వాగ్వాదానికి దిగాడు. ఇదే క్రమంలో లిట్టన్ దాస్ వింతసైగలతో సిరాజ్‌ను రెచ్చగొట్టాడు. ఆ తర్వాత బంతికే సిరాజ్ అద్భుతమైన బంతితో లిట్టన్‌ను బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య సైగల వార్ జరిగింది. అయితే, రెండో రోజు ఆట ముగిసిన తర్వాత, మహ్మద్ సిరాజ్ అక్కడ జరిగిన అసలు విషయం చెప్పేశాడు. మీడియా సమయంలో మాట్లాడిన సిరాజ్ అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పుకొచ్చాడు.

లిట్టన్ దాస్‌తో ఏం చెప్పారని సిరాజ్‌ని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘నేను పెద్దగా మాట్లాడలేదు. ఇది టీ20 ఫార్మాట్ కాదు. ఇది టెస్ట్ క్రికెట్ అని ఎప్పుడో చెప్పానని’ అని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సిరాజ్ వేసిన ఈ ఓవర్ తొలి బంతిని లిట్టన్ ఆఫ్ సైడ్ ఆడాడు. ‎ఆ తర్వాత సిరాజ్ లిట్టన్ దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడుతూ కనిపించాడు. ఈ సమయంలో, లిట్టన్ దాస్ కూడా తన స్పందనతో ఈ చర్చలో మరింత హీట్ పెంచాడు. ఇది జరిగిన వెంటనే, సిరాజ్ రెండో బంతికి లిట్టన్‌ను బౌల్డ్ చేసి ఆసక్తికర రీతిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. అదే సమయంలో విరాట్ కూడా లిట్టన్ సైగలను రిపీట్ చేస్తూ కనిపించాడు.

చిట్టగాంగ్‌లో జరుగుతున్న టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌటైంది. భారత జట్టు తరపున ఛెతేశ్వర్ పుజారా (90), శ్రేయాస్ అయ్యర్ (86), ఆర్ అశ్విన్ (58) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశే 150 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 254 పరుగుల ఆధిక్యం లభించింది. కుల్దీప్ యాదవ్ ఐదు, మహ్మద్ సిరాజ్ మూడు, ఉమేష్ యాదవ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. మళ్లీ బ్యాటింగ్ చేయాలని టీమ్ ఇండియా నిర్ణయించుకుంది. బంగ్లాను ఫాలో-ఆన్ ఆడించకుండానే.. భారత్ రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. వార్తలు రాసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టపోయి 77 పరుగులు చేసింది. దీంతో మొత్తంగా భారత్ ఆధిక్యం 331 పరుగులకు చేరింది. ప్రస్తుతం గిల్ 50, పుజారా 1 పరుగుతో బ్యాటింగ్ చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..