AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలిసారి నేపాల్‌ గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా.. కొత్త కెప్టెన్‌తో బరిలోకి.. ఎవరో తెలుసా?

Team India A Nepal Tour: భారత్, నేపాల్ దేశాల మధ్య క్రీడా సంబంధాలను బలోపేతం చేయడానికి బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ అనుభవాన్ని అందించడంతో పాటు, నేపాల్ లాంటి ఎదుగుతున్న క్రికెట్ దేశానికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. డిసెంబర్‌లో జరిగే ఈ సిరీస్‌లో యువ భారత్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

తొలిసారి నేపాల్‌ గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా.. కొత్త కెప్టెన్‌తో బరిలోకి.. ఎవరో తెలుసా?
Team India A Nepal Tour
Venkata Chari
|

Updated on: Jul 11, 2026 | 11:34 AM

Share

Team India A Nepal Tour: భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త జోష్ ఇచ్చే వార్త ఇది. చరిత్రలోనే మొదటిసారి భారత క్రికెట్ జట్టు ఒక వినూత్న పర్యటనకు సిద్ధమైంది. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా పొరుగుదేశం నేపాల్‌తో తలపడేందుకు టీమిండియా ‘ఎ’ జట్టు అక్కడ అడుగుపెట్టబోతోంది. ఈ చారిత్రాత్మక సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, షెడ్యూల్, జట్టు వివరాలు ఓసారి చూద్దాం..

పొరుగుదేశంతో క్రికెట్ బంధం.. బీసీసీఐ గ్రీన్ సిగ్నల్..!

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో నేపాల్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో ఆ జట్టు సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇటీవల జరిగిన పొట్టి ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్ లాంటి బలమైన జట్టుకు నేపాల్ గట్టి పోటీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. టెస్టు హోదా లేకపోవడం వల్ల పెద్ద జట్లతో ఆడే అవకాశం రాని నేపాల్ క్రికెట్ అసోసియేషన్ (CAN), ఈసారి ఎలాగైనా భారత్‌తో సిరీస్ జరపాలని పట్టుబట్టింది. స్కాట్లాండ్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో నేపాల్ ప్రతినిధులు బీసీసీఐ కార్యదర్శి దేవిజీత్ సైకియాను కలవడంతో ఈ చారిత్రాత్మక పర్యటనకు ముహూర్తం కుదిరింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: ఆ చెత్త ప్లేయర్.. ఇలాగే ఛాన్స్‌లిస్తే జింబాబ్వేపైనా మీరు గెలవలేరు గంభీర్..!

డిసెంబరులో టీ20 సమరం.. షెడ్యూల్ ఇదే..!

క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది డిసెంబర్ నెలలో భారత్ ‘ఎ’ జట్టు నేపాల్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.

మొదటి టీ20: డిసెంబర్ 9

రెండూ టీ20: డిసెంబర్ 11

మూడో టీ20: డిసెంబర్ 13

ఈ మ్యాచ్‌లన్నీ కీర్తీపూర్‌లోని ప్రతిష్టాత్మక టీయూ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలో జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం నేపాల్ అభిమానులు ఇప్పుడే పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నారు.

యువ సంచలనాలు, ఐపీఎల్ స్టార్లతో భారత జట్టు..!

ఈ పర్యటనకు భారత సీనియర్ జట్టు వెళ్లనప్పటికీ.. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన యువ సంచలనాలతో కూడిన బలమైన ‘ఎ’ జట్టును బీసీసీఐ బరిలోకి దించుతోంది. ఈ జట్టుకు స్టార్ బ్యాటర్ రజత్ పాటిదార్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అలాగే బుల్లెట్ వేగంతో బంతులు విసిరే స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ కూడా ఈ జట్టులో కీలక ఆకర్షణగా మారనున్నాడు.

ఇది కూడా చదవండి: వద్దని చెప్పినా అంటగట్టేశారు.. అతని వల్లే సిరీస్ కోల్పోయాం.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్..

నేపాల్ పర్యటనకు అంచనా టీమిండియా ‘ఎ’ జట్టు: రజత్ పాటిదార్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ఆయుష్ బదోని, రియాన్ పరాగ్, సూర్యాంశ్ షెడ్గే, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ, సుయాష్ శర్మ, విప్రజ్ నిగమ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us