T20 World Cup 2026 Final: ప్లేయింగ్ XI నుంచి మ్యాచ్ విన్నర్ ఔట్.. షాకింగ్ నిర్ణయం.. ఎందుకంటే?
India vs New Zealand Final: రెండుసార్లు గెలిచిన భారత జట్టు నాలుగోసారి టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ఆడుతోంది. వరుసగా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచే అవకాశం టీమిండియాకు ఉంది. టాస్ గెలిచిన కివీస్ ముందుగా బౌలింగ్ చేసేందుకు సిద్ధమైంది.

India vs New Zealand Playing XI: టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ ఓడిపోయాడు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ భారత జట్టును ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ తమ ప్లేయింగ్ XIలో గణనీయమైన మార్పు చేసింది. తమ బిగ్ మ్యాచ్ విన్నర్ మెక్‌కాంచీని తొలగించి జాకబ్ డఫీని జట్టులోకి తీసుకున్నారు. భారత జట్టు తమ ప్లేయింగ్ XIలో ఎటువంటి మార్పులు చేయలేదు.
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, లూకీ ఫెర్గూసన్, జాకబ్ డఫ్ఫీ.
