T20 World Cup 2024: ‘వాహ్‌‌.. సిరాజ్ మియా’.. బౌండరీ లైన్ వద్ద హైదరాబాదీ పేసర్ కళ్లు చేదిరే క్యాచ్.. వీడియో

యూఎస్‌ఏతో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ వేసిన 15వ ఓవర్ 4వ బంతిని డీప్ మిడ్ వికెట్  దిశగా నితీశ్ కుమార్ భారీ షాట్ కొట్టాడు. బంతి మరో బౌండరీ దాటబోతోందని అందరూ అనుకున్నారు. కానీ బౌండరీకి ​​సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ వెనక్కు అడుగులేస్తూ బంతిని అద్భుతంగా  క్యాచ్ పట్టాడు

T20 World Cup 2024: వాహ్‌‌.. సిరాజ్ మియా.. బౌండరీ లైన్ వద్ద హైదరాబాదీ పేసర్ కళ్లు చేదిరే క్యాచ్.. వీడియో
Mohammed Siraj

Updated on: Jun 13, 2024 | 5:00 PM

T20 ప్రపంచ కప్ 25వ మ్యాచ్‌లో , మహమ్మద్ సిరాజ్ తన అద్భుతమైన క్యాచ్‌తో బెస్ట్ ఫీల్డర్ అవార్డును గెలుచుకున్నాడు. యూఎస్‌ఏతో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ వేసిన 15వ ఓవర్ 4వ బంతిని డీప్ మిడ్ వికెట్  దిశగా నితీశ్ కుమార్ భారీ షాట్ కొట్టాడు. బంతి మరో బౌండరీ దాటబోతోందని అందరూ అనుకున్నారు. కానీ బౌండరీకి ​​సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ వెనక్కు అడుగులేస్తూ బంతిని అద్భుతంగా  క్యాచ్ పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిరాజ్ ఫీల్డింగ్‌పై పలువురు క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా  ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో దృష్టిని ఆకర్షించారు. దీంతో బెస్ట్ ఫీల్డర్ అవార్డు ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ క్యూరియాసిటీకి టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ బ్రేక్ వేయడం విశేషం.

 

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్ తర్వాత, యువరాజ్ సింగ్ టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో కనిపించాడు. బెస్ట్ ఫీల్డర్‌కు ఇచ్చే బెస్ట్ ఫీల్డర్ మెడల్ కూడా సిరాజ్‌కు లభించింది. దీంతో అతను అద్భుతమైన క్యాచ్ పట్టిన మహ్మద్ సిరాజ్‌ మెడలో మెడల్ వేసి మరింత ఉత్సాహపరిచాడు.

 

అంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చక్కగా ఫీల్డింగ్ చేసిన మహ్మద్ సిరాజ్ బెస్ట్ ఫీల్డర్ పతకాన్ని సాధించాడు. మళ్లీ అవార్డు గెలుచుకోవడంలో విజయం సాధించడంపై సిరాజ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ రూమ్ వేడుక వీడియోను BCCI తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అభిమానుల నుండి భారీ ప్రశంసలను  అందుకుంటోంది. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత జట్టు 18.2 ఓవర్లలో 111 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సూపర్-8 దశకు చేరుకుంది.

మహ్మద్ సిరాజ్ సూపర్బ్ క్యాచ్ .. వీడియో ఇదిగో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..