T20 World Cup 2024: ఆసీస్ సంచలన నిర్ణయం.. టీ20 కెప్టెన్సీ నుంచి కమిన్స్ ఔట్! కొత్త సారథి ఎవరంటే?

|

Mar 13, 2024 | 11:10 AM

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక T20 వరల్డ్ కప్ కోసం కొత్త కెప్టెన్‌ని ఎంపిక చేస్తుందని తెలుస్తోంది. గతంలో కెప్టెన్‌గా ఉన్న ప్యాట్ కమిన్స్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించనుందని వార్తలు వస్తున్నాయి. సారథ్య బాధ్యతలను డేరింగ్ అండ్ డ్యాషింగ్‌ బ్యాటర్..

T20 World Cup 2024: ఆసీస్ సంచలన నిర్ణయం.. టీ20 కెప్టెన్సీ నుంచి కమిన్స్ ఔట్! కొత్త సారథి ఎవరంటే?
Australia Cricket
Follow us on

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక T20 వరల్డ్ కప్ కోసం కొత్త కెప్టెన్‌ని ఎంపిక చేస్తుందని తెలుస్తోంది. గతంలో కెప్టెన్‌గా ఉన్న ప్యాట్ కమిన్స్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించనుందని వార్తలు వస్తున్నాయి. సారథ్య బాధ్యతలను డేరింగ్ అండ్ డ్యాషింగ్‌ బ్యాటర్ మిచెల్ మార్ష్‌కు కట్టబెట్టనున్నట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రాబోయే T20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా జట్టుకు మిచెల్ మార్ష్ నాయకత్వం వహిస్తాడని అభిప్రాయపడ్డారు. దీంతో త్వరలోనే ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్ మారడం దాదాపు ఖాయం. పాట్ కమిన్స్ నాయకత్వంలో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి కమిన్స్‌ను తప్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అయితే 2023 వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత పాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టుకు నాయకత్వం వహించిన మిచెల్ మార్ష్ జట్టును అద్భుతంగా నడిపించాడు. మార్ష్ నాయకత్వంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0 తేడాతో కైవసం చేసుకోగా, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ రెండు సిరీస్ విజయాలతో మిచెల్ మార్ష్ తన నాయకత్వ లక్షణాలను చాటుకున్నాడు. దీంతో త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం వహించే దిశగా దూసుకుపోతున్నాడు. అందుకే జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న క్రికెట్ పోరులో ఆసీస్ జట్టు కెప్టెన్ గా మిచెల్ మార్ష్ కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఇవి కూడా చదవండి

మిచెల్ మార్ష్ కే కెప్టెన్సీ బాధ్యతలు..

 

న్యూజిలాండ్ ను మట్టికరిపించిన ఆసీస్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..