AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: సెమీస్ చేరాలంటే గెలవక తప్పదు.. భారత్, ఆసీస్ హెడ్-టు-హెడ్ రికార్డ్‌లు, గణాంకాలు ఎలా ఉన్నాయో తెలుసా?

India vs Australia Head-to-Head Records and Stats: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా 51వ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తలపడనున్నాయి. సూపర్ 8లో గ్రూప్ 1లో భాగంగా జరనున్న ఈ మ్యాచ్ సెయింట్ లూసియాలోని డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియంలో నేడు జరగనుంది. సెమీఫైనల్‌కు వెళ్లే విషయంలో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత చాలా ఎక్కువ. భారత్ తన గ్రూప్‌లో 2 విజయాలతో అగ్రస్థానంలో ఉంది. అయితే, తదుపరి దశలో దాని స్థానం నిర్ధారణ కావాలంటే, ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంటుంది.

IND vs AUS: సెమీస్ చేరాలంటే గెలవక తప్పదు.. భారత్, ఆసీస్ హెడ్-టు-హెడ్ రికార్డ్‌లు, గణాంకాలు ఎలా ఉన్నాయో తెలుసా?
Ind Vs Aus
Venkata Chari
|

Updated on: Jun 24, 2024 | 7:30 AM

Share

India vs Australia Head-to-Head Records and Stats: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా 51వ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తలపడనున్నాయి. సూపర్ 8లో గ్రూప్ 1లో భాగంగా జరనున్న ఈ మ్యాచ్ సెయింట్ లూసియాలోని డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియంలో నేడు జరగనుంది. సెమీఫైనల్‌కు వెళ్లే విషయంలో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత చాలా ఎక్కువ. భారత్ తన గ్రూప్‌లో 2 విజయాలతో అగ్రస్థానంలో ఉంది. అయితే, తదుపరి దశలో దాని స్థానం నిర్ధారణ కావాలంటే, ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంటుంది. అదే సమయంలో, ఆఫ్ఘనిస్తాన్‌పై ఆస్ట్రేలియా ఓటమి ముందుకు వెళ్లడం కష్టతరం చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడిస్తేనే, ఆసీస్‌కు ఛాన్స్ ఉంటుంది. అయితే, కంగారూలకు భారత జట్టును ఓడించడం అంత సులభం కాదు. ఎందుకంటే క్రికెట్‌లోని పొట్టి ఫార్మాట్‌లో, ఆస్ట్రేలియాపై టీమిండియాదే పైచేయిగా నిలిచింది.

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై ఆధిక్యంలో భారత్‌..

టోర్నమెంట్ చరిత్రలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య చాలా క్లోజ్ మ్యాచ్‌లు జరిగాయి. చాలా మ్యాచ్‌లలో విజేత భారీ విజయాన్ని నమోదు చేసింది. 2007 నుంచి T20 ప్రపంచ కప్‌లో ఈ రెండు జట్ల మధ్య 5 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీమ్ ఇండియా 3 గెలిచింది. ఆస్ట్రేలియా 2 మ్యాచ్‌లు గెలిచింది. ఈ రెండు జట్ల మధ్య మొదటి మ్యాచ్ 2007 ప్రారంభ ఎడిషన్‌లో జరిగింది. ఇందులో భారత్ 15 పరుగుల తేడాతో గెలిచింది. అదే సమయంలో, 2010, 2012లో ఆస్ట్రేలియా వరుసగా 49, 9 వికెట్ల తేడాతో గెలుపొందగా, భారత జట్టు 2014లో 73 పరుగులతో, 2016లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

టీ20 ఇంటర్నేషనల్‌లో రికార్డుల గురించి మాట్లాడితే, ఇక్కడ కూడా భారత్‌దే పైచేయి కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 31 మ్యాచ్‌ల్లో భారత్ 19 సార్లు విజయాన్ని చవిచూడగా, ఆస్ట్రేలియా 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కాగా, 1 మ్యాచ్ ఫలితం లేకుండానే ముగిసింది.

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. కోహ్లి 22 మ్యాచ్‌ల్లో 794 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 8 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. అదే సమయంలో, ఆస్ట్రేలియాపై 13 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన జస్ప్రీత్ బుమ్రా అత్యధికంగా 16 వికెట్లు తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ