Team India: కొత్త ఆటగాళ్లకు నో ఛాన్స్.. కట్‌చేస్తే.. టీమిండియా కెప్టెన్‌పై వేటుకు సిద్ధమైన బీసీసీఐ?

Team India Captain: మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో పేలవమైన ఆట తీరుతో సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న భారత మహిళల జట్టు.. గ్రూప్ దశ నుంచి ఇంటి బాట పట్టింది. ఈ క్రమంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. న్యూజిలాండ్‌,ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత జట్టు.. అటు ఫీల్డింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ దారుణంగా విఫలమైంది.

Team India: కొత్త ఆటగాళ్లకు నో ఛాన్స్.. కట్‌చేస్తే.. టీమిండియా కెప్టెన్‌పై వేటుకు సిద్ధమైన బీసీసీఐ?
Harmanpreet Kaur From Team
Follow us
Venkata Chari

|

Updated on: Oct 16, 2024 | 12:49 PM

Team India: మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఈ టోర్నీలో బలమైన పోటీదారుగా పేరుగాంచిన భారత మహిళల జట్టు.. నాకౌట్ దశకు కూడా చేరుకోలేక గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఇప్పుడు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం, ప్రధాన కోచ్ అమోల్ మజుందార్‌తో సమావేశం నిర్వహించేందుకు ప్లాన్ చేసిందంట. దీంతో బీసీసీఐ త్వరలో హర్మన్‌ప్రీత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించవచ్చు అని తెలుస్తోంది. దీంతో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా గత 2, 3 ఏళ్లలో జట్టులో ఎలాంటి ఎదుగుదల లేదని విమర్శించింది. కొత్త కెప్టెన్‌ని కూడా డిమాండ్ చేసింది.

న్యూజిలాండ్‌ సిరీస్‌కు ముందే..

భారత మహిళల జట్టు అక్టోబర్ 24 నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, దీనికి ముందు టీమిండియా హెడ్ కోచ్ అమోల్ మజుందార్‌తో బీసీసీఐ సమావేశం నిర్వహించవచ్చు. ఈ సమయంలో, హర్మన్‌ప్రీత్ భవిష్యత్తు నిర్ణయించనున్నారు. 2025 వన్డే ప్రపంచకప్‌నకు ముందు, BCCI ఇప్పుడు ఆమెను తొలగించి కొత్త కెప్టెన్‌ని తీసుకురావాలని కోరుతోంది.

2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఆమె కెప్టెన్సీలో టీమిండియా నాకౌట్ దశకు చేరుకుంది. 2020 ఎడిషన్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే, టోర్నీలో విజేతగా నిలవడంలో మాత్రం విజయం సాధించలేదు.

హర్మన్‌ప్రీత్‌ను బీసీసీఐ ఎందుకు తొలగించాలనుకుంటోంది?

హర్మన్‌ప్రీత్ కౌర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం వెనుక కొన్ని కారణాలు బయటపడ్డాయి. జట్టు చాలా బలంగా ఉన్నప్పటికీ ఈసారి భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకోలేకపోవడమే అతిపెద్ద కారణం. అదే సమయంలో, టీ20 ప్రపంచకప్‌ను గెలవడానికి బలమైన పోటీదారుగా కూడా పరిగణించారు. అయితే, తొలుత న్యూజిలాండ్ చేతిలో ఓడి ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓడి సెమీ ఫైనల్ కల చెదిరిపోయింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో టీమిండియా ఫిట్‌నెస్, ఫీల్డింగ్ కూడా పెద్ద సమస్యగా మారింది. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై 3 కీలక క్యాచ్‌లను వదిలేసింది.

మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా జట్టు ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు..

11 మందిలో కేవలం ఇద్దరు ఫిట్‌మెంట్ ప్లేయర్‌ల ఆధారంగా పెద్ద టోర్నీలు గెలవలేమని చెప్పుకొచ్చింది. ఆమె ప్రకారం, జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్ మినహా ఇతర ఆటగాళ్లు మైదానంలో అంత చురుకుగా లేరు. హర్మన్‌ప్రీత్ హయాంలో కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకపోవడంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత కొన్నేళ్లుగా జట్టులో ఎలాంటి ఎదుగుదల లేదని మిథాలీ పేర్కొంది. పాత ఆటగాళ్లు మాత్రమే నిరంతరం కనిపిస్తున్నారు.

ప్రతి పెద్ద టోర్నీ తర్వాత కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం వల్లే తాము మరింత రాణిస్తుంటారని, పురుషుల జట్టును ఇందుకు ఉదాహరణగా మిథాలీ పేర్కొంది. హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలో కొత్త ఆటగాళ్లు సన్నద్ధం కాలేకపోయారు. అదే సమయంలో, పెద్ద టోర్నమెంట్‌లకు ముందు టీమ్ మేనేజ్‌మెంట్ ప్లానింగ్ కూడా బాగా లేదు. యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌నకు ఆసియా కప్ సన్నద్ధతకు పెద్ద అవకాశంగా మారింది. కానీ, అవకాశాలన చేజార్చుకుంది. యుఎఇలో టోర్నమెంట్ ప్రారంభమైనప్పుడు, నంబర్ 3, నంబర్ 4 స్థానాల్లో బ్యాటింగ్ విషయంలో గందరగోళం నెలకొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..