T20 World Cup 2024:టీమిండియా క్రికెటర్ల గొప్ప మనసు.. బుజ్జి అభిమానిని డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఆహ్వానించి.. వీడియో

|

Jun 06, 2024 | 2:17 PM

టీ20 ప్రపంచకప్ 2024: టీ20 ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఐర్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 16 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటైంది.

T20 World Cup 2024:టీమిండియా క్రికెటర్ల గొప్ప మనసు.. బుజ్జి అభిమానిని డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఆహ్వానించి.. వీడియో
Team India
Follow us on

టీ20 ప్రపంచకప్ 2024: టీ20 ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఐర్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 16 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటైంది. ఈ సులభమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా తరుపున రోహిత్ శర్మ 52 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 36 పరుగులు చేశాడు. దీంతో 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. కాగా గతంలో లాగే ఈ మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ వేడుకలో అత్యుత్తమ ఫీల్డర్‌కు ప్రత్యేక బహుమతి బహూకరించారు. ఐర్లాండ్‌పై అద్భుత ప్రదర్శన చేసిన మహమ్మద్ సిరాజ్ ఫీల్డర్ ఆఫ్ మ్యాచ్ పతకాన్ని గెలుచుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో వేగంగా 26 పరుగులు చేసిన డెలానీని రనౌట్ చేయడంలో మహ్మద్ సిరాజ్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. దీంతో ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ సిరాజ్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అయితే ఈ అవార్డును అందజేయడానికి ఓ ప్రత్యేక అతిథి వచ్చారు. ఈ మ్యాచ్ జాతీయ గీతం సమయంలో కనిపించిన పంజాబీ బుడ్డోడిని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ డ్రెస్సింగ్ రూమ్‌కి ఆహ్వానించాడు. అలా భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో వచ్చేసిన సుభేక్ అనే చిన్న అభిమాని చేతుల మీదుగా మహ్మద్ సిరాజ్‌కు అత్యుత్తమ ఫీల్డర్ పతకాన్ని అందించారు. ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ రూమ్ వేడుక వీడియోను BCCI తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిని చూసిన టీమిండియా అభిమానులు, నెటిజన్లు భారత క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 

వీడియో ఇదిగో..

భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌ను జూన్ 9న ఆడనుంది. న్యూయార్క్‌లోని నసావు స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది.

జైషా అభినందనలు..

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..