Pak vs Aus: 2010లో మైఖేల్ హస్సీ.. 2021లో మాథ్యూ వేడ్.. రెండుసార్లు పాకిస్తాన్ ఆశలను చిదిమేసిన ఆసీస్ ఆటగాళ్లు..!
T20 World Cup 2021, PAK vs AUS: టీ20 ప్రపంచకప్ 2021లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ విజయంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మాథ్యూ వేడ్ కీలక పాత్ర పోషించాడు.
T20 World Cup 2021, PAK vs AUS: గురువారం ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫైనల్‌కు వెళ్లాలన్న కలను ఆస్ట్రేలియా చెదరగొట్టింది. ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు టిక్కెట్‌ను బుక్ చేసుకుంది. టైటిల్ కోసం న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఆస్ట్రేలియా చేతిలో పాకిస్థాన్ జట్టు మరోసారి ఫైనల్‌కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయింది. 2010లో మైఖేల్ హస్సీ పాకిస్తాన్ పాలిట విలన్‌గా మారగా, ఈసారి మాథ్యూ వేడ్ వారి కలలను చెదరగొట్టాడు. ఆఖరి ఓవర్లలో వీరిద్దరూ చెలరేగి పాకిస్తాన్ విజయ గర్వాన్ని అణచివేశారు.
టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్‌కు పాకిస్థాన్‌ను ఆహ్వానించింది. నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగుల భారీ స్కోర్ చేసిన పాకిస్తాన్ విజయానికి తామే అర్హులమంటూ ఊగిపోయింది. అయితే ఆస్ట్రేలియా ఆరంభంలో నిర్ణీత వ్యవధిలో వికెట్లు కోల్పోతూ, పాకిస్తాన్‌కు దాసోహం అయ్యేలానే కనిపించింది. వార్నర్ వికెట్ టర్నింగ్ పాయింట్ అని నిరూపించిన ఈ మ్యాచులో మాథ్యూ వేడ్ పాకిస్తాన్ కోరికపై భారీ దెబ్బ కొడుతూ ఆసీస్‌ను ఫైనల్‌కు చేర్చాడు. షహీన్ షా ఆఫ్రిదిపై మాథ్యూ వేడ్ వరుసగా మూడు సిక్సర్లు(6, 6, 6) కొట్టి మార్కస్ స్టోయినిస్‌తో కలిసి 40 బంతుల్లో 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించాడు.
2010లో మేఖేల్ హస్సీ.. చివరి నిమిషంలో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించిన వేడ్ మ్యాచ్ ను పాక్ చేతుల్లోంచి లాగేసుకున్నాడు. 2010 టీ20 ప్రపంచ కప్‌లో మైఖేల్ హస్సీ పాకిస్తాన్ జట్టుకు ట్రబుల్‌షూటర్‌గా మారాడు. ఆ ఏడాది కూడా రెండు జట్లు సెమీ ఫైనల్స్‌లో తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ కమ్రాన్ అక్మల్ (50), ఉమర్ అక్మల్ (56 నాటౌట్) ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా ముందు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా ఆరంభం నుంచి ఒత్తిడికి లోనైనట్లు కనిపించింది. పాక్ బౌలర్లు మహ్మద్ అమీర్, అబ్దుర్ రెహ్మాన్ ముందు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. 105 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆతర్వాత, కామెరాన్ వైట్, మైఖేల్ హస్సీ జోడీ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. అయితే 17వ ఓవర్ మూడో బంతికి వైట్ కూడా 43 పరుగులు చేసి వెనుదిరిగాడు. అప్పటికి స్కోర్ స్కోరు 17.1 ఓవర్లలో 7 వికెట్లకు 144 పరుగులు చేసింది. దీని తర్వాత అందరి ఆశలు మైకేల్ హస్సీపైనే ఉన్నాయి.
పాక్ కలలను తుంచిన మైఖేల్ హస్సీ.. చివరి 12 బంతుల్లో ఆస్ట్రేలియా విజయానికి 34 పరుగులు చేయాల్సి ఉంది. అమీర్‌పై అఫ్రిది విశ్వాసం చూపించాడు. హస్సీ ఆరు బంతుల్లో 16 పరుగులు (4, 2, 2 ఎల్బీ, 2, 2, 4) చేశాడు. దీంతో చివరి ఓవర్‌లో ఆస్ట్రేలియా విజయానికి 18 పరుగులు చేయాల్సి ఉంది. రెండో బంతికే హస్సీ స్ట్రైక్ అందుకున్నాడు. మొదట రెండు సిక్సర్లు బాదిన అతను ఒక ఫోర్ కొట్టాడు. ఆ ఓవర్ ఐదో బంతికి హస్సీ సిక్సర్ కొట్టి జట్టును తొలిసారి ఫైనల్ కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో హస్సీ 24 బంతులు ఎదుర్కొని 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ సమయంలో అతను 3 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. అతని స్ట్రైక్ రేట్ 250గా ఉంది.