T20 World Cup 2021, NZ vs NAM: ఆదిలోనే న్యూజిలాండ్‌కు షాకిచ్చిన నమీబియా బౌలర్లు.. గప్టిల్, మిచెల్ ఔట్..!

NZ vs NAM: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా నేడు డబుల్ హెడర్స్‌లో భాగంగా తొలి మ్యాచులో నమీబియా వర్సెస్ న్యూజిలాండ్ టీంలు తలపడుతున్నాయి.

T20 World Cup 2021, NZ vs NAM: ఆదిలోనే న్యూజిలాండ్‌కు షాకిచ్చిన నమీబియా బౌలర్లు.. గప్టిల్, మిచెల్ ఔట్..!
T20 World Cup 2021, Nz Vs Nam
Follow us
Venkata Chari

|

Updated on: Nov 05, 2021 | 4:12 PM

T20 World Cup 2021, NZ vs NAM: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా నేడు డబుల్ హెడర్స్‌లో భాగంగా తొలి మ్యాచులో నమీబియా వర్సెస్ న్యూజిలాండ్ టీంలు తలపడుతున్నాయి. వార్ వన్ సైడ్ అంటున్న చాలామందికి నమీబియా బౌలర్లు ఆదిలోనే రెండు వికెట్లు పడగొట్టి షాకిచ్చారు. ఫుల్ ఫాంలో ఉన్న మార్టిన్ గప్టిల్ వికెట్‌ను పడగొట్టి ఔరా అనిపించిన నమీడియా బౌలర్లు, ఆ వెంటనే మిచెల్‌ను కూడా పెవిలియన్ చేర్చారు. ఈ మ్యాచులో టాస్ గెలిచిన నమీబియా టీం తొలుత బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ఆరభంచిన కివీస్‌కు ఇన్నింగ్స్ 4.1 ఓవర్‌లో భారీ షాక్ తగిలింది. వైస్ వేసిన తొలి బంతిని మిడ్ ఆఫ్ మీదుగా బౌండరీ తరలించేందుకు ప్రయత్నంచాడు. కానీ, ట్రంపెల్‌మాన్ మిడ్-ఆఫ్‌లో సులభమైన క్యాచ్ తీసుకున్నాడు. దీంతో మార్టిన్ గప్టిల్ నమీబియాపై భారీ ఇన్నింగ్స్ ఆడకుండానే వెనుదిరిగాడు. ఈ మ్యాచులో గప్టిల్ 18(18 బంతులు, 1ఫోర్, 1 సిక్స్) పరుగులకు పెవిలియన్ చేరాడు.

6.2 ఓవర్లో మిచెల్ 19 పరుగులు(15 బంతులు, 2 ఫోర్లు), స్కోల్ట్జ్ బౌలింగ్‌లో స్వీపర్ కవర్‌లో భారీ షాట్ ఆడాడు. కానీ, వాన్ లింగేన్ అద్భుతంగా అందుకున్న క్యాచ్‌తో మిచెల్ పెవిలయ్ చేరాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ టీం 7 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది. క్రీజులో కేన్ విలియమ్సన్ 6, డేవాన్ కాన్వే 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

Also Read: Shoaib Akhtar: ఆ రోజు నేను చేసింది తప్పే.. అక్తర్‌కు మిలియన్ సార్లు క్షమాపణలు చెబుతున్నా: పీటీవీ హోస్ట్

IND vs NZ: ప్లేస్ మాత్రమే మారింది.. పవర్ కాదు.. బంతి, బ్యాట్‌తోనూ సత్తా చాటిన వెంకటేష్ అయ్యర్.. కివీస్‌ సిరీస్‌కు సిద్ధమంటూ సిగ్నల్

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!