T20 World Cup 2021: తృటిలో తప్పిన ప్రమాదం.. తలకు బాల్ తగలడంతో కుప్పకూలిన కివీస్ బౌలర్.. అసలేమైందంటే?
న్యూజిలాండ్ లెగ్ స్పిన్నర్ ఇష్ సోధి తృటిలో తప్పించుకున్నాడు. డేవిడ్ వీసా కొట్టిన బంతి అతని నుదిటికి తాకింది.
T20 World Cup 2021, NZ vs NAM: టీ20 ప్రపంచకప్2021 లో పెను ప్రమాదం తప్పింది. నమీబియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బంతి ఆటగాడి నుదిటికి తగిలింది. న్యూజిలాండ్ స్పిన్నర్ ఇష్ సోధి తన సొంత బంతికి క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. బంతి ఇష్ సోధి తలకి తగిలి వెంటనే కింద పడిపోయాడు. బంతి ఇష్ సోధీ తలకి తగలగానే మైదానంలో ఉన్న ప్రతి ఆటగాడు ఉలిక్కిపడ్డాడు. అంపైర్‌తోపాటు ఆటగాళ్లందరూ అతని వద్దకు చేరుకున్నారు. అందరూ సోధిని అతని క్షేమం గురించి అడిగారు. ఆశ్చర్యకరంగా, బంతి చాలా వేగంతో సోధి నుదిటికి తాకింది. అయితే అతనికి చిన్న గీత కూడా పడకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
12వ ఓవర్‌లో ఇష్ సోధి బౌలింగ్ చేస్తున్నాడు. నమీబియా ఆల్‌రౌండర్ డేవిడ్ వీసా ఆడిన ఓ బాల్‌ను ముందుకు కొట్టాడు. బంతి గాలిలో ఉంది. సోధి వైపు చాలా వేగంగా వచ్చింది. ఈ కివీస్ ఆటగాడు దానిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, బంతి అతని వేళ్లకు తగిలి వెంటనే నుదిటికి తగిలింది. బంతి తగిలిన వెంటనే సోధి నేలపై పడిపోయాడు. వెంటనే ఆటగాళ్లందరూ, న్యూజిలాండ్ ఫిజియోలు ఈ బౌలర్ పరిస్థితిని తెలుసుకోవడానికి ఆయన దగ్గరకు చేరారు. అయితే సోధీ పూర్తిగా క్షేమంగా ఉన్నారని తేలింది.
World Cup: ఈ ఆటగాడి కారణంగా భారత్ ప్రపంచకప్ ఆశలు గల్లంతు.! అతడెవరో తెలుసా.?