T20 World Cup 2021: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్ టీం.. టీ20 ప్రపంచకప్ వార్మప్‌లో ఘోర పరాజయం..!
2021 టీ 20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌లో ఐర్లాండ్ టీం బంగ్లాదేశ్‌ని 33 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచులో 7 గురు బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్స్ డబుల్ ఫిగర్ దాటకపోవడం గమనార్హం.
T20 world cup 2021, BAN vs IRE: టీ 20 సిరీస్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లను ఓడించిన బంగ్లాదేశ్ జట్టు.. 2021 టీ 20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌లో షాక్ తగిలింది. అబుదాబిలో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు ఓడిపోయింది. ఐర్లాండ్ టీం బంగ్లాదేశ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 3 వికెట్లకు 177 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్టు కేవలం 144 పరుగులకే ఆలౌట్ కావడంతో ఓటమిపాలైంది.
రాణించిన ఐర్లాండ్ బ్యాట్స్ మెన్స్, బౌలర్లు వార్మప్ మ్యాచ్‌లో ఐరిష్ బ్యాట్స్‌మెన్స్, బౌలర్లు సమిష్టిగా రాణించారు. ఓపెన్ పాల్ స్టిర్లింగ్ ఐర్లాండ్‌కు ఘనమైన ఆరంభాన్ని అందించాడు. అతను 16 బంతుల్లో 5 ఫోర్ల సహాయంతో 22 పరుగులు చేశాడు. కెప్టెన్ ఆండీ బుల్బిరిని 25 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గారెత్ డెలానీ బంగ్లాదేశ్ బౌలర్లను చిత్తు చేశాడు. ఈ బ్యాట్స్‌మెన్ 50 బంతుల్లో 8 సిక్సర్లు, 3 ఫోర్లతో అజేయంగా 88 పరుగులు చేశాడు. ఈ కుడి చేతి బ్యాట్స్‌మెన్ సిక్స్‌లు, ఫోర్లతోనే 60 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్ల ప్రదర్శన నిరాశపరిచింది. తస్కిన్ అహ్మద్, మెహదీ హసన్ మినహా, మిగిలిన బౌలర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఐపీఎల్ 2021 లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న ముస్తీఫిజుర్ రహమాన్ 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చాడు. షోరిఫుల్ ఇస్లాం 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చాడు. నసుమ్ అహ్మద్ 3 ఓవర్లలో 33 పరుగులు సమర్పించుకున్నాడు.
డబుల్ ఫిగర్ దాటని 7గురు బ్యాట్స్‌మెన్స్.. బంగ్లాదేశ్ ఓపెనర్స్ ఫ్లాపయ్యారు. మహ్మద్ నయీమ్ 3, కెప్టెన్ లిట్టన్ దాస్ 1 పరుగు చేసిన తర్వాత పెవిలియన్ చేరి నిరాశపరిచారు. వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. సౌమ్య సర్కార్ 37 పరుగులు, నరుల్ హసన్ 38 పరుగులతో రాణించినా బంగ్లాను గెలిపించలేకపోయారు. ఐరిష్ బౌలర్ల పదునైన బౌలింగ్ ముందు బంగ్లాదేశ్ జట్టు 144 పరుగులకే తోకముడిచింది.
టీ 20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో ఓడిపోవడం బంగ్లాదేశ్‌కు కచ్చితంగా ఎదరుదెబ్బే. ఇటీవల బంగ్లాదేశ్ ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి జట్లను ఓడించింది. కానీ, అబుదాబిలో ఐర్లాండ్ ముందు లొంగిపోయారు. ఐపీఎల్ 2021 లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న స్టార్ ఆటగాడు షకీబ్ అల్ హసన్‌ను కూడా బంగ్లాదేశ్ కోల్పోయింది. బుధవారం క్వాలిఫయర్ 2 లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై షకీబ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కోల్‌కతా జట్టు ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. కానీ ఈ ఆటగాడు లేకపోవడం వారి జాతీయ జట్టును దెబ్బతీస్తోంది.
Big News: టీమిండియాకు దూరం కానున్న విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ.. కారణం ఏంటంటే?