Cricket: 43 బంతుల్లో పెను విధ్వంసం.. 9 సిక్సర్లతో బౌలర్ల భరతం పట్టిన కోహ్లీ ఫ్రెండ్.. ఎవరో తెలుసా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు రజత్ పాటిదర్ తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ.. టోర్నమెంట్‌లో..
ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టీ20లో మధ్యప్రదేశ్ జట్టు రెండో విజయాన్ని అందుకుంది. ఎలైట్ గ్రూప్ ఏలో రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 14 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు రజత్ పాటిదర్ తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ.. టోర్నమెంట్‌లో రెండో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రజత్ పాటిదర్ 43 బంతుల్లో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక మధ్యప్రదేశ్ జట్టు నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో రైల్వేస్ చతికిలబడింది. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. మధ్యప్రదేశ్ బౌలర్లలో అశ్విన్ దాస్ 3 వికెట్లు, కుమార్ కార్తికేయ 2 వికెట్లు పడగొట్టి.. ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
43 బంతుల్లో పెను విధ్వంసం..
జట్టు స్కోర్ 50 పరుగులు ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు. అయితే రజత్ పాటిదర్(92) మాత్రం ఎదుర్కున్న తొలి బంతి నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్ధికి చుక్కలు చూపించాడు. ఒకవైపు వికెట్లు పడిపోతున్నా.. మరోవైపు స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాడు రజత్ పాటిదర్. 43 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..