IPL 2024: హసరంగ స్థానంలో హైదరాబాద్ జట్టులోకి 22ఏళ్ల స్పిన్నర్.. ఎవరో తెలుసా?
SRH Sign Vijayakanth as Hasaranga's Replacement: గాయపడిన వనిందు హసరంగా స్థానంలో విజయకాంత్ వ్యాస్కాంత్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంపిక చేసింది. అతను శ్రీలంకకు చెందిన లెగ్ స్పిన్నర్. UAEలో ఇటీవల ముగిసిన ILT20 టోర్నమెంట్‌లో MI ఎమిరేట్స్ జట్టుకు విజయకాంత్ వ్యాస్కాంత్ ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో అతను 4 మ్యాచ్‌ల్లో మొత్తం 8 వికెట్లు తీశాడు. అతను బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌తో పాటు లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు.
SRH Sign Vijayakanth as Hasaranga’s Replacement: ఐపీఎల్ 2024 (IPL 2024) కోసం గాయపడిన లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చినట్లు ప్రకటించింది. హసరంగ స్థానంలో 22 ఏళ్ల శ్రీలంక స్పిన్నర్ విజయకాంత్ వ్యాస్కాంత్‌ను హైదరాబాద్ జట్టులోకి తీసుకుంది. రూ.50 లక్షల ప్రాథమిక ధరతో హైదరాబాద్ జట్టులోకి వచ్చాడు. 22 ఏళ్ల విజయకాంత్ శ్రీలంక తరపున ఒక టీ20 ఆడాడు. గతేడాది ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
UAEలో ఇటీవల ముగిసిన ILT20 టోర్నమెంట్‌లో MI ఎమిరేట్స్ జట్టుకు విజయకాంత్ వ్యాస్కాంత్ ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో అతను 4 మ్యాచ్‌ల్లో మొత్తం 8 వికెట్లు తీశాడు. అతను బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌తో పాటు లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. హసరంగ మడమకు గాయమైంది. ఈ కారణంగా అతను IPL 2024 నుంచి తప్పుకున్నాడు. బంగ్లాదేశ్ పర్యటనలో అతను ఈ గాయానికి గురయ్యాడు.
హసరంగను రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేయగా..
హసరంగాను రూ. 1.5 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అతను ఈ జట్టు కోసం మొదటిసారి ఆడాడు. కానీ, అతని ఎడమ పాదం మడమలో గాయం కారణంగా, హైదరాబాద్‌కు ఆడాలనే హసరంగ ఆకాంక్షలు ఆగిపోయాయి. అంతకుముందు, హసరంగాను RCB 2022 వేలంలో రూ. 10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అతను ఒకే జట్టు కోసం రెండు సీజన్లు ఆడాడు.
ఆర్‌సీబీ తరపున తొలి సీజన్‌లో 26 వికెట్లు..
🚨 ANNOUNCEMENT 🚨
Wanindu Hasaranga will be unavailable for the season due to injury. We would like to wish him a speedy recovery.
Sri Lankan spinner Vijayakanth Viyaskanth has joined the squad as his replacement for the rest of #IPL2024. Welcome, Viyaskanth! ✨ pic.twitter.com/A2Z5458dH8
— SunRisers Hyderabad (@SunRisers) April 9, 2024
తొలి సీజన్‌లో ఆర్‌సీబీ తరపున ఆడుతూ హసరంగ ప్రదర్శన బాగుంది. తొలి సీజన్‌లో మొత్తం 26 వికెట్లు తీశాడు. కానీ, గత సీజన్‌లో అతని ప్రదర్శన పేలవంగా ఉంది. దీంతో ఆర్సీబీ అతడిని విడుదల చేసింది.
22 ఏళ్ల విజయకాంత్ గతేడాది ఆసియా గేమ్స్‌లో పాల్గొన్న శ్రీలంక జట్టులో భాగమయ్యాడు. అందులో అతను నాలుగు ఓవర్లలో 28 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ యువ ఆటగాడు తన కెరీర్‌లో ఇప్పటివరకు 33 టీ20లు ఆడి 6.76 ఎకానమీతో 42 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..