IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమైన స్టార్ ఆల్‌రౌండర్
ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకునేందుకు పోరాడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. కాలి కండరాల గాయం కారణంగా వాషింగ్టన్ టోర్నీ నుంచి తప్పుకున్నట్లు ..
ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే కనీసం ఇప్పటినుంచైనా దూకుడు పెంచాల్సిందే. ఇదిలా ఉంటే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకునేందుకు పోరాడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. కాలి కండరాల గాయం కారణంగా వాషింగ్టన్ టోర్నీ నుంచి తప్పుకున్నట్లు సన్‌రైజర్స్ టీమ్ మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. కాగా ధనాధన్ లీగ్‌లో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ కేవలం 2 విజయాలు మాత్రమే సాధించింది. మొత్తం 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది ఆజట్టు. ఇదిలా ఉంటే గత మ్యాచ్ లోనే ఫామ్ లోకి వచ్చాడు సుందర్ . మొదటి 6 మ్యాచ్‌లలో సూపర్‌ఫ్లాప్ అయిన అతను ఢిల్లీ క్యాపిటల్స్‌పై బ్యాట్‌తోనూ, బంతితోనూ విధ్వంసం సృష్టించాడు. మొదటి 6 మ్యాచుల్లో ఒక వికెట్ పడగొట్టని ఈ స్పిన్నర్ ఢిల్లీపై 3 వికెట్లు తీశాడు. అది కూడా ఓకే ఓవర్‌లోనే. అనంతరం బ్యాటింగ్‌లోనూ 15 బంతుల్లో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు. ఇలా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కమ్ బ్యాక్ ఇచ్చిన ఆనందం సన్‌రైజర్స్‌కు ఎక్కువ రోజులు నిలవలేదు. మోకాలి గాయంతో సుందర్ తప్పుకోవడంతో ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బేనని భావించ వచ్చు.
కాగా తన తర్వాతి మ్యాచ్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే తలపడనుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా శనివారం (ఏప్రిల్ 29) ఈ మ్యాచ్ జరగనుంది. మరి గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓటమికి సన్‌రైజర్స్ ప్రతీకారం తీర్చుకుంటుందో?లేదో?అన్నది చూడాలి. కాగా రూ. 13 కోట్లు పెట్టి మరీ కొన్న ఆ జట్టు ఓపెనర్ హ్యారీ బ్రూక్ వరుసగా విఫలమవ్వడం సన్‌రైజర్స్‌ను ఆందోళన పరుస్తోంది. అలాగే మర్కరమ్ కూడా పెద్ద స్కోర్లు చేయడం లేదు. దీంతో ఆ జట్టు వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది.
? INJURY UPDATE ?
Washington Sundar has been ruled out of the IPL 2023 due to a hamstring injury.
Speedy recovery, Washi ? pic.twitter.com/P82b0d2uY3
— SunRisers Hyderabad (@SunRisers) April 27, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..