Rohit Sharma : రోహిత్ శర్మకు మరో బ్యాడ్ న్యూస్ రానుందా? సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలతో ఫ్యాన్స్ షాక్
భారత వన్డే జట్టు కెప్టెన్ మారడంతో రోహిత్ శర్మ ఎరా ముగిసింది. ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టును ప్రకటించినప్పుడు, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. శుభ్‌మన్ గిల్‌ను వన్డే జట్టుకు కొత్త కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే రోహిత్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతారు. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ త్వరలో మరిన్ని బ్యాడ్ న్యూస్ రావచ్చని అన్నారు.

Rohit Sharma : భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడంతో రోహిత్ శర్మ శకం ముగిసినట్లేనని చాలా మంది భావిస్తున్నారు. ఆస్ట్రేలియా టూర్ కోసం జట్టును ప్రకటిస్తూ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్… శుభ్‌మన్ గిల్‌ను కొత్త వన్డే కెప్టెన్‌గా ప్రకటించారు. రోహిత్ కేవలం బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతాడని తెలిపారు. ఈ పరిణామాల మధ్య, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మకు త్వరలోనే మరో బ్యాడ్ న్యూస్ రాబోతుందని చెప్పడం సంచలనం సృష్టించింది.
2027 వన్డే ప్రపంచ కప్ వరకు భారత జట్టుకు ఎక్కువ వన్డే మ్యాచ్‌లు లేవని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. కాబట్టి రోహిత్ శర్, విరాట్ కోహ్లీ తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలంటే దేశవాళీ క్రికెట్‌లో చురుకుగా ఉండాలని ఆయన అన్నారు. స్పోర్ట్స్ తక్‌తో జరిగిన సంభాషణలో సునీల్ గవాస్కర్‌ను “రోహిత్ శర్మ విషయంలో ఇంకా ఏమైనా బ్యాడ్ న్యూస్ రావచ్చా?” అని అడిగినప్పుడు, ఆయన అవును అని సమాధానం ఇచ్చారు.
సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. “అవును, కచ్చితంగా వస్తుంది. మీరు (రోహిత్ శర్మ) నిబద్ధతతో లేకపోతే, మీరు రాబోయే 2 సంవత్సరాలకు సిద్ధంగా ఉంటారా లేదా అని నిర్ణయించుకోలేకపోతే, బ్యాడ్ న్యూస్ కోసం సిద్ధంగా ఉండండి. మీరు కేవలం వన్డేలు మాత్రమే ఆడితే, మీకు ఎక్కువ ప్రాక్టీస్ అవసరం అవుతుంది. విజయ్ హజారే ట్రోఫీ వంటి టోర్నమెంట్‌లలో పాల్గొనాలని వారికి కూడా తెలుసు” అని అన్నారు.
భారత దిగ్గజం గవాస్కర్ ఇంక ఏం చెప్పారంటే రోహిత్ శర్మ ఇప్పుడు కేవలం వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడు..కానీ 2027 ప్రపంచ కప్ వరకు టీమిండియాకు ఎక్కువ వన్డే మ్యాచ్‌లు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రపంచ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్‌కు అవసరమైనంత ప్రాక్టీస్ రోహిత్ శర్మకు లభించదు. రోహిత్ జట్టులో స్థానం పక్కా కానందువల్లే శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా చేసే నిర్ణయం తీసుకుని ఉండవచ్చని గవాస్కర్ అన్నారు. ఎవరికైనా జట్టు ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యత అని ఆయన నొక్కి చెప్పారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




