- Telugu News Sports News Cricket news Sunil gavaskar becomes 1st batsman to score 10000 test runs in ahmedabad on this day 7th march
Team India: పాక్‌పై చారిత్రాత్మక ఇన్నింగ్స్.. భారత ప్లేయర్ ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే.. మ్యాచ్ ఆపేసిన జనం.. ఎందుకో తెలుసా?
On This Day: భారత వెటరన్ ప్లేయర్ సునీల్ గవాస్కర్‌కు మార్చి 7వ తేదీ చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున అతను తన కెరీర్‌లో భారీ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
Updated on: Mar 07, 2023 | 11:35 AM

లిటిల్ మాస్టర్‌గా పేరుగాంచిన భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ తన 16 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ప్రపంచంలోని ప్రతి ప్రమాదకరమైన బౌలర్లను ఎదుర్కొంటూ బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపించాడు. గవాస్కర్ జీవితంలో మార్చి 7వ తేదీ చాలా ప్రత్యేకమైనది. గవాస్కర్ 36 ఏళ్ల క్రితం ఈ రోజున అంటే మార్చి 7న 10000 వేల పరుగుల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు.

గవాస్కర్ తన టెస్టు కెరీర్‌లో మార్చి 7, 1987న 10,000 పరుగులు పూర్తి చేశాడు. అలా చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతని తర్వాత చాలా మంది ఆటగాళ్ళు ఈ స్థానాన్ని సాధించారు. అయితే ఈ ఫీట్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన మొదటి వ్యక్తిగా గవాస్కర్ నిలిచాడు.

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గవాస్కర్ ఈ ఘనత సాధించాడు. అహ్మదాబాద్‌లోని మోటెరా స్టేడియంలో జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్‌లో గవాస్కర్ బ్యాటింగ్‌కు వచ్చేసరికి 10,000 పరుగులకు 58 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు స్టేడియంలో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

గవాస్కర్ 57 పరుగులతో ఉన్నాడు. పాక్ బౌలర్ ఇజాజ్ ఫకీహ్ వేసిన బంతిని స్లిప్ దిశలో షాట్ ఆడుతూ గవాస్కర్ ఒక పరుగు పూర్తి చేశాడు.

గవాస్కర్ సింగిల్ తీయగానే అభిమానులు సంబరాలు చేసుకున్నారు. దీంతో మ్యాచ్‌ను 20 నిమిషాల పాటు నిలిపివేశారు. గవాస్కర్‌కు పూలమాలలు వేసి సత్కరించారు.

ఈ టెస్టు మ్యాచ్‌లో గవాస్కర్ 63 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ఫలితం కూడా డ్రా అయింది. గవాస్కర్ తన టెస్ట్ కెరీర్‌లో మొత్తం 125 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 214 ఇన్నింగ్స్‌లలో 10,122 పరుగులు చేశాడు. అతని పేరు మీద 34 సెంచరీలు ఉన్నాయి. అప్పట్లో ఇది ప్రపంచ రికార్డు కూడా.




