- Telugu News Photo Gallery Cricket photos India vs australia 4th test r ashwin eyes on anil kumble special record
IND vs AUS 4th Test: సరికొత్త చరిత్రకు 5 అడుగుల దూరం.. బద్దలవ్వనున్న కుంబ్లే భారీ రికార్డ్.. అదేంటంటే?
India Vs Australia: మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రెండు భారీ రికార్డులను ఆర్ అశ్విన్ బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు.
Updated on: Mar 07, 2023 | 11:01 AM

అహ్మదాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో, చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది. 4 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. అహ్మదాబాద్‌లో సిరీస్‌ను చేజిక్కించుకోవడంతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించాలని టీమిండియా కన్నేసింది. అయితే, ప్రస్తుతం అహ్మదాబాద్‌లో అందరి చూపు ఆర్ అశ్విన్‌పైనే నెలకింది. అందుకు క్ష ప్రత్యేక కారణం ఉంది.

భారత స్టార్ బౌలర్ అశ్విన్ నాలుగో టెస్టులో భారత గ్రేట్ బౌలర్ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టగలడు. కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాలంటే అశ్విన్ నాలుగో టెస్టులో కనీసం 5 వికెట్లు పడగొట్టాల్సి ఉంది.

అశ్విన్ ఈ ఘనత సాధిస్తే టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అవతరిస్తాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రికార్డు కుంబ్లే పేరిట ఉంది.

ఆస్ట్రేలియాపై టెస్టు క్రికెట్‌లో అనిల్ కుంబ్లే 111 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ 107 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరూ మినహా మరే భారత బౌలర్ ఈ జట్టుపై 100 వికెట్లకు మించి తీయలేదు.

ఇది కాకుండా, స్వదేశంలో టెస్ట్ క్రికెట్‌లో కుంబ్లే, అశ్విన్ ఇద్దరూ తలో 25 వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్నారు. అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాపై మరో 5 వికెట్లు తీసి అశ్విన్ కుంబ్లేను అధిగమిస్తాడు.




