Team India : టీమిండియాలో సీటు కోసం తంటాలు.. అభిమన్యు ఈశ్వరన్‌కు ఎందుకు అవకాశం రావట్లేదు?
అభిమన్యు ఈశ్వరన్ లాంటి ప్రతిభావంతుడైన, అనుభవజ్ఞుడైన ఆటగాడికి అవకాశం ఇవ్వకపోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. దేశవాళీ క్రికెట్ ప్రదర్శనను విస్మరించి ఐపీఎల్ ప్రదర్శనకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం భారత క్రికెట్‌కు దీర్ఘకాలంలో మంచిది కాదు. ఓవల్ టెస్ట్‌లోనైనా అభిమన్యుకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.

Team India : టీమిండియా ఇంగ్లాండ్ పర్యటన ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. లీడ్స్, బర్మింగ్‌హామ్, మాంచెస్టర్ తర్వాత, భారత జట్టు మళ్ళీ లండన్ చేరుకుంది. జూలై 31న ఓవల్ కెన్నింగ్‌టన్ మైదానంలో ఐదో, చివరి టెస్ట్ జరగనుంది. అయితే, అంతకుముందే జట్టు ఎంపికపై మరోసారి చర్చ మొదలైంది. ఈసారి చర్చకు కారణం ఎక్స్ పీరియన్స్ బ్యాట్స్‌మెన్ అభిమన్యు ఈశ్వరన్. అతను నాలుగు సంవత్సరాలుగా టీమ్ ఇండియాలో భాగంగా ప్రతి పర్యటనలో ఉన్నాడు, కానీ ఇప్పటికీ తన టెస్ట్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు.
అభిమన్యు ఈశ్వరన్ సిరీస్‌లోని ప్రతి టెస్ట్‌కు ముందు టీమ్ ప్రాక్టీస్ సెషన్‌లో కనిపించాడు. అది ఫీల్డింగ్ అయినా, నెట్స్ సెషన్ అయినా అతను ప్రతిసారీ ఉత్సాహంగా కనిపించాడు. కానీ, అతన్ని ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చడానికి మాత్రం టీమ్ మేనేజ్‌మెంట్ వెనకడుగు వేస్తోంది. మాంచెస్టర్‌లో కూడా కరుణ్ నాయర్‌ను పక్కన పెట్టినప్పుడు, అభిమన్యుకు అవకాశం లభిస్తుందని అంతా భావించారు. కానీ, సాయి సుదర్శన్‌ను మాత్రమే ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చారు.
అభిమన్యు ఈశ్వరన్ 2021-22 నుండి భారత టెస్ట్ జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. అతను జట్టుతో కలిసి నిరంతరం పర్యటించాడు. కానీ, సెలక్టర్లు అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు. ఈ సమయంలో అతని తర్వాత జట్టులోకి వచ్చిన 15 మంది ఆటగాళ్లు తమ టెస్ట్ అరంగేట్రం చేశారు. ఇందులో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రజత్ పాటిదార్ వంటి పేర్లు ఉన్నాయి. అంటే, అభిమన్యు నాలుగు సంవత్సరాలుగా జట్టులో ఉన్నప్పటికీ, కేవలం టూరిస్ట్ లాగే జట్టుతో కలిసి తిరుగుతున్నాడు.
టీమ్ మేనేజ్‌మెంట్ వ్యూహంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే వారు పదేపదే ఐపీఎల్ ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. సాయి సుదర్శన్ ఐపీఎల్ 2025లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఉండవచ్చు, కానీ దేశవాళీ క్రికెట్‌లో గణాంకాలు అభిమన్యుకు అనుకూలంగా ఉన్నాయి.
అభిమన్యు ఈశ్వరన్ ఫస్ట్ క్లాస్ రికార్డులు
మ్యాచ్‌లు: 103
పరుగులు: 7841
సగటు: 54.25
సెంచరీలు: 27
అర్ధసెంచరీలు: 31
సాయి సుదర్శన్ ఫస్ట్ క్లాస్ రికార్డులు
మ్యాచ్‌లు: 30
పరుగులు: 1987
సగటు: 36
సెంచరీలు: 7
అర్ధసెంచరీలు: 5
ఎక్స్ పీరియన్స్, గణాంకాల పరంగా అభిమన్యు, సాయి సుదర్శన్ కంటే చాలా ముందున్నాడు. భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చాలాసార్లు దేశవాళీ క్రికెట్ ప్రదర్శనను జట్టు సెలక్షన్ ప్రాతిపదికగా తీసుకోవాలని అన్నారు. కానీ, ఎంపిక నిర్ణయాలలో గంభీర్ ఈ మాటలు ఎక్కడా కనిపించడం లేదు. అందుకే, మాజీ సెలెక్టర్ సబా కరీం జట్టు ఎంపికను బహిరంగంగా విమర్శించారు. జూలై 31 నుండి ప్రారంభం కానున్న ఓవల్ టెస్ట్‌లో టీమిండియా సమతుల్య జట్టును రూపొందించాలని చూస్తుంటే, ఇది అభిమన్యు ఈశ్వరన్ కు ఒక అవకాశంగా మారవచ్చు. భారత్ ఇప్పటికే సిరీస్‌లో వెనుకబడి ఉంది, మరియు చివరి మ్యాచ్‌లో ఫలితం సాధించడానికి జట్టుకు అనుభవజ్ఞులైన ఆటగాళ్ల అవసరం ఉంది. ఈసారి సెలక్టర్లు అభిమన్యు కు అవకాశం ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




