AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

R Ashwin: తెరపైకి అశ్విన్ బయోపిక్! టీమిండియా క్రికెటర్‌గా ఎవరు నటించనున్నారంటే?

సుమారు 14 ఏళ్లుగా టీమిండియాకు సేవలు అందిస్తోన్న రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉండగానే అశ్విన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అశ్విన్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది.

R Ashwin:  తెరపైకి అశ్విన్ బయోపిక్! టీమిండియా క్రికెటర్‌గా ఎవరు నటించనున్నారంటే?
Ravichandran Ashwin
Basha Shek
|

Updated on: Dec 18, 2024 | 6:43 PM

Share

టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ బుధవారం (డిసెంబర్ 18) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన అతను సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఆటకు వీడ్కోలు చెప్పాడు. అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతలో అతని బయోపిక్ ఆలోచన కూడా తెరమీదకు వచ్చింది. అశ్విన్‌పై బయోపిక్‌ చర్చ 2021లో మొదలైంది. క్రికెటర్లు, రాజకీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు సహా చాలా మంది ప్రముఖులపై బయోపిక్‌లు రూపొందించే ట్రెండ్ ఇప్పుడు బలంగా ఉంది. క్రికెట్ కు సంబంధించి సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, ముత్తయ్య మురళీధరన్ సహా పలువురు క్రికెటర్ల బయోపిక్‌లు తెరకెక్కాయి. ఆర్. అశ్విన్‌ బయోపిక్‌ కూడా రూపొందనుందని 2021లోనే ప్రచారం జరిగింది. ఇందులో అశ్విన్ తో పాటు ధోనీ పాత్ర కూడా హైలైట్ అవుతుందని చెప్పుకొచ్చారు. ఇందులో అశ్విన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు అశోక్ సెల్వన్ కూడా నటిస్తాడని రూమర్లు వచ్చాయి. అంతేకాదు అశోక్ సెల్వన్ ఇండియన్ జెర్సీని ధరించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే ఈ రూమర్లపై అశోక్ సెల్వన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఎలాంటి నిజం లేదని, అశ్విన్ బయోపిక్ లో తాను నటించడం లేదన్నాడు. ఈ ట్వీట్‌కి అశ్విన్ కూడా స్పందించాడు. ఇప్పుడీ గ్రేటెస్ట్ స్పిన్నర్ రిటైర్మెంట్ తో మరోసారి బయోపిక్ చర్చలు తెర మీదకు వచ్చాయి.

కాగా అశ్విన్ సుమారు 14 సంవత్సరా పాటు భారత క్రికెట్ జట్టుకు సేవలందించాడు. టీమిండియా తరఫున 106 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. మొత్తం 200 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేశాడు. 27246 బంతులు వేసి 537 వికెట్లు తీశాడు. దీంతో అనిల్ కుంబ్లే తర్వాత భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. అలాగే 116 వన్డేల్లో 114 ఇన్నింగ్స్‌లు ఆడిన అశ్విన్ 6303 బంతుల్లో 156 వికెట్లు పడగొట్టాడు. 65 టీ20 మ్యాచుల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన అశ్విన్ 72 వికెట్లు పడగొట్టాడు. దీని ద్వారా టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 50కి పైగా వికెట్లు తీసిన టీమిండియా బౌలర్‌గా నిలిచాడు.

గతంలో అశ్విన్ బయోపిక్ పై అశోక్ సెల్వన్ ట్వీట్..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండు టెస్టులు మిగిలి ఉండగానే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మతో కలిసి విలేకరుల సమావేశానికి వచ్చిన తర్వాత అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..