Video: ట్రావిస్ హెడ్ తల పొగరుదించిన ఆకాష్ దీప్.. లైవ్ మ్యాచ్‌లో ఘోర అవమానం
Ind vs Aus, Gabba Test: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాశ్‌దీప్ కూడా బ్యాటింగ్‌లో తన ప్రతిభను కనబరిచి భారత్‌కు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
Akash Deep vs Travis Head: గబ్బా వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో టీమ్ ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆకాశ్‌దీప్ చేసిన పని వ్యాఖ్యాతలను కూడా నవ్వించేలా చేసింది. బ్యాటింగ్ చేస్తున్న భారత ఫాస్ట్ బౌలర్ ఆకాశ్‌దీప్.. పక్కనే ఉన్న ట్రావిస్ హెడ్‌కి బంతి ఇవ్వకుండా మైదానంలో పడేశాడు. దీనికి ట్రావిస్ హెడ్ కోపంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత, ఆకాష్ అలెక్స్ కారీకి సారీ చెప్పడం కనిపించింది.
హెడ్‌ను తగిన బుద్ది చెప్పిన ఆకాష్‌దీప్..
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న గబ్బా టెస్టు ఐదో రోజు తొలి సెషన్‌లో ఈ దృశ్యం కనిపించింది. టీమిండియా తొమ్మిది వికెట్లు కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్‌దీప్ చివరి వికెట్‌గా క్రీజులో ఉన్నారు. ఆకాష్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ఓ బంతిని ఆడడం మిస్ అయ్యాడు. ఆ బంతి బ్యాట్‌కు తగిలి ప్యాడ్‌లో ఇరుక్కుపోయింది. సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న హెడ్ ఆకాష్ బంతిని తీసుకోవడానికి వచ్చాడు.
ఆకాష్ ప్యాడ్ నుంచి బంతిని తీసివేస్తున్న సమయంలో.. ఆపై హెడ్ బంతిని అడిగాడు. కానీ, బంతిని హెడ్‌కి ఇవ్వకుండా, ఆకాష్ దానిని నేలపై విసిరాడు. ఆ తర్వాత, హెడ్ అతని వైపు చూస్తూ, బంతిని స్వయంగా తీయడం ప్రారంభించాడు. అప్పుడు ఆకాష్ వికెట్ కీపర్ అలెక్స్ కారీకి ‘ఐ యామ్ సారీ’ అని చెప్పుకొచ్చాడు. ఈ ఫన్నీ సంఘటన చూసి వ్యాఖ్యాతలు కూడా నవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత హెడ్ కూడా నవ్వుతూ కనిపించాడు. ఈ ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా లైక్ అవుతోంది.
ఆకాష్ దీప్ వికెట్ పడగొట్టిన ట్రావిస్ హెడ్..
View this post on Instagram
అనంతరం ఆకాశ్‌దీప్ వికెట్‌ను ట్రావిస్ హెడ్ తీయడం గమనార్హం. 213 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా చివరి వికెట్‌కు అవసరమైన పరుగులను జోడిస్తోంది. క్రీజులో బుమ్రా, ఆకాష్ మధ్య మంచి భాగస్వామ్యం నెలకొని ఉంది. వీరిద్దరూ చివరి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. కంగారూ జట్టు ప్రధాన బౌలర్లు బుమ్రా, ఆకాష్‌ల వికెట్లను తీయలేకపోయారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బంతిని ట్రావిస్ హెడ్‌కి అప్పగించాడు. అతను తన రెండో ఓవర్ ఐదో బంతికి ఆకాష్‌ను అవుట్ చేసి భారత్‌ను 260 పరుగులకు తగ్గించాడు. ఆకాశ్ 44 బంతుల్లో 31 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..