AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వామ్మో.. ఇదేం కొట్టుడు సామీ.. 14 ఫోర్లు, 6 సిక్స్‌లు.. తుఫాన్ సెంచరీతో పాక్ బౌలర్లపై ఊచకోత..

Kusal Mendis Century: కుశాల్ మెండిస్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతను దక్షిణాఫ్రికాపై సెంచరీని కోల్పోయాడు. కానీ ఆ లోటును పాకిస్తాన్‌పై భర్తీ చేశాడు. మెండిస్ కేవలం 65 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ప్రపంచకప్‌లో శ్రీలంక నుంచి ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. మెండిస్ పాకిస్థాన్ ప్రతి బౌలర్‌ను చితక్కొట్టాడు. సెంచరీ పూర్తి చేసిన తర్వాత మరింత దూకుడు పెంచాడు. 29వ ఓవర్ మూడు, నాలుగో బంతుల్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు.

Video: వామ్మో.. ఇదేం కొట్టుడు సామీ.. 14 ఫోర్లు, 6 సిక్స్‌లు.. తుఫాన్ సెంచరీతో పాక్ బౌలర్లపై ఊచకోత..
Kusal Mendis 65 Ball Centur
Venkata Chari
|

Updated on: Oct 10, 2023 | 5:53 PM

Share

Pakistan vs Sri Lanka, 8th Match: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుశాల్ మెండిస్ పాకిస్థాన్‌పై సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో మెండిస్ పాక్ బౌలర్లపై ధీటుగా విరుచుకుపడి జట్టుకు ఆరంభంలో తగిలిన ఎదురుదెబ్బల నుంచి గట్టెక్కించి భారీ స్కోరు దిశగా తీసుకెళ్లాడు. సిక్స్‌తో సెంచరీ పూర్తి చేశాడు. మెండిస్ 65 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు.

ఈ సమయంలో మెండిస్‌కు ఓ లైఫ్ కూడా లభించింది. అతను 19 పరుగుల వద్ద ఉన్నప్పుడు, షాహీన్ షా ఆఫ్రిది వేసిన బంతిని ఇమామ్ ఉల్ హక్ గల్లీ వద్ద క్యాచ్ మిస్ చేశాడు. మెండిస్ ఈ బహుమతిని పూర్తిగా సద్వినియోగం చేసుకుని తుఫాను సెంచరీని నమోదు చేశాడు.

ఇవి కూడా చదవండి

రికార్డు సృష్టించిన మెండీస్..

View this post on Instagram

A post shared by ICC (@icc)

మెండిస్ 65 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ప్రపంచకప్‌లో శ్రీలంక నుంచి ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. మెండిస్ పాకిస్థాన్ ప్రతి బౌలర్‌ను చితక్కొట్టాడు. సెంచరీ పూర్తి చేసిన తర్వాత మరింత దూకుడు పెంచాడు. 29వ ఓవర్ మూడు, నాలుగో బంతుల్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. కానీ, తర్వాతి బంతికే బౌండరీకి ​వద్ద చిక్కాడు. ఈ క్యాచ్‌ని ఇమామ్ అందుకున్నాడు. మెండిస్ 77 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 122 పరుగులు చేశాడు.

పాక్ బౌలర్లకు ధీటుగా బ్యాటింగ్..

View this post on Instagram

A post shared by ICC (@icc)

ఈ మ్యాచ్‌లో రెండో ఓవర్‌లోనే శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. కుశాల్ పెరీరాకు హసన్ అలీ పెవిలియన్ దారి చూపించాడు. ఇక్కడ మరో వికెట్ పడగొట్టి శ్రీలంకను బ్యాక్‌ఫుట్‌లో ఉంచే అవకాశాన్ని పాక్ మిస్ చేసుకుంది. కానీ, మెండిస్‌తో కలిసి పాతుమ్ నిస్సాంక జట్టుపై నియంత్రణ సాధించాడు. వీరిద్దరూ 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నిస్సాంక 51 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. నిస్సాంక ఔట్ అయిన తర్వాత కూడా మెండిస్ ఆగకుండా పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సదీర సమరవ్రికమతో కలిసి 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఇరుజట్ల ప్లేయింగ్ 11:

శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లాలఘే, మహిష్ తీక్షణ్, మతీష్ పతిరణ, దిల్షన్ మధుశంక.

పాకిస్థాన్ (ప్లేయింగ్ ఎలెవన్): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..