AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK Vs SL: హైదరాబాద్‌లో పాక్ బౌలర్ల తాట తీసిన కుశాల్, సధీరా.. బాబర్ సేనకు భారీ టార్గెట్..

Pakistan vs Sri Lanka, 8th Match: ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లకు శ్రీలంక జట్టు 9 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. దీంతో బాబర్ సేన ముందు భారీ టార్గెట్ నిలిచింది. కుశాల్ మెండిస్ 77 బంతుల్లో 158.44 స్ట్రైక్ రేట్‌తో 122 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. కాగా, సదీర సమరవిక్రమ 89 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశాడు. పాకిస్థాన్ తరపున హసన్ అలీ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు.

PAK Vs SL: హైదరాబాద్‌లో పాక్ బౌలర్ల తాట తీసిన కుశాల్, సధీరా.. బాబర్ సేనకు భారీ టార్గెట్..
Pak Vs Sl
Venkata Chari
|

Updated on: Oct 10, 2023 | 6:18 PM

Share

Pakistan vs Sri Lanka, 8th Match: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పాకిస్థాన్, శ్రీలంక జట్లు ముఖాముఖిగా తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు శుభారంభం లభించకపోయినా.. ఆ తర్వాత కుశాల్ మెండిస్ అద్భుత ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. అలాగే సధీర కూడా సెంచరీతో చెలరేగడంతో పాకిస్తాన్‌కు భారీ టార్గెట్ అందించారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లకు శ్రీలంక జట్టు 9 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. దీంతో బాబర్ సేన ముందు భారీ టార్గెట్ నిలిచింది.

కుశాల్ మెండిస్ కేవలం 65 బంతుల్లోనే సెంచరీ మార్కును చేరుకున్నాడు.  తద్వారా ప్రపంచకప్‌లో శ్రీలంక తరపున అతి తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా కుశాల్ మెండిస్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు కుమార సంగక్కర పేరిట ఉండేది. కుమార సంగక్కర 70 బంతుల్లో సెంచరీ సాధించాడు. 2015 ప్రపంచకప్‌లో అతను ఈ సెంచరీని సాధించాడు. కానీ, ఇప్పుడు కుశాల్ మెండిస్ తన పేరు మీద రికార్డు సృష్టించాడు.

ఇవి కూడా చదవండి

కుశాల్ మెండిస్ 77 బంతుల్లో 158.44 స్ట్రైక్ రేట్‌తో 122 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. కాగా, సదీర సమరవిక్రమ 89 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశాడు. పాకిస్థాన్ తరపున హసన్ అలీ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు.

View this post on Instagram

A post shared by ICC (@icc)

ఓ సమయంలో శ్రీలంక జట్టు స్కోరును 380 దాటి సులువుగా తీసుకెళ్తుందని అనిపించినా.. చివరి ఓవర్లలో పాక్ బౌలర్లు ధీటుగా పుంజుకుని శ్రీలంకను 350 పరుగులలోపే కట్టడి చేశారు. చివరి 10 ఓవర్లలో పాక్ బౌలర్లు 61 పరుగులిచ్చి 5 వికెట్లు తీశారు.

ఇరుజట్ల ప్లేయింగ్ 11:

శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లాలఘే, మహిష్ తీక్షణ్, మతీష్ పతిరణ, దిల్షన్ మధుశంక.

పాకిస్థాన్ (ప్లేయింగ్ ఎలెవన్): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు