AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025: తండ్రి మరణించిన మరుసటి రోజే మ్యాచ్‌కు రెడీ.. సెల్యూట్ చేయాల్సిందే..

Dunith Wellalage To Rejoin Sri Lanka Squad: శ్రీలంక బౌలర్ దునిత్ వెల్లాలాగే తండ్రి సురంగ వెల్లలాగే సెప్టెంబర్ 18న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా మరణించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ తర్వాత ఆయనకు ఈ సంఘటన గురించి తెలిసింది. దీంతో హుటాహుటిన స్వదేశానికి బయల్దేరాడు.

Asia Cup 2025: తండ్రి మరణించిన మరుసటి రోజే మ్యాచ్‌కు రెడీ.. సెల్యూట్ చేయాల్సిందే..
Dunith Wellalage
Venkata Chari
|

Updated on: Sep 20, 2025 | 8:35 AM

Share

Dunith Wellalage To Rejoin Sri Lanka Squad: శ్రీలంక ఆల్ రౌండర్ దునిత్ వెల్లలాగే 2025 ఆసియా కప్‌లో ఆడటానికి అందుబాటులో ఉంటాడు. అతను తిరిగి జట్టులో చేరి ఆడటానికి సిద్ధమయ్యాడు. తన తండ్రి మరణం తర్వాత దునిత్ వెల్లలాగే స్వదేశానికి తిరిగి రావలసి వచ్చింది. సెప్టెంబర్ 18న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ తర్వాత అతని తండ్రి మరణించాడు. మ్యాచ్ తర్వాత జట్టు మేనేజర్ ఈ విషయాన్ని అతనికి తెలియజేశాడు. శ్రీలంక తొలి సూపర్ ఫోర్ మ్యాచ్ సెప్టెంబర్ 20న బంగ్లాదేశ్‌తో జరగనుంది.

వెల్లలాగే తండ్రి సురంగ వెల్లగే గుండెపోటుతో మరణించారు. శ్రీలంక క్రికెటర్ స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు, అతని జట్టు మేనేజర్ మహింద హలంగోడ్ అతనితో పాటు వచ్చాడు. ఇద్దరు కలిసి మరలా దుబాయ్ చేరుకున్నారు. వెల్లలాగే, హలంగోడ్ ఇద్దరూ సెప్టెంబర్ 18 రాత్రి యూఏఈ నుంచి శ్రీలంకకు ప్రయాణించిన సంగతి తెలిసిందే.

శ్రీలంక చివరి మ్యాచ్‌ పరిస్థితి..

సెప్టెంబర్ 18న జరిగిన తమ చివరి గ్రూప్ బి మ్యాచ్‌లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఎనిమిది బంతుల ముందుగానే విజయం సాధించి సూపర్ ఫోర్‌కు అర్హత సాధించింది. వెల్లలాగేకు ఈ మ్యాచ్ అంతగా బాగోలేదు. అతను 49 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. మహ్మద్ నబీ తన చివరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. 32 పరుగులు పిండుకున్నాడు. అయితే, అతనికి బ్యాటింగ్‌కు చేసే అవకాశం రాలేదు.

ఇవి కూడా చదవండి

దునిత్ వెల్లలాగే కెరీర్ ఎలా ఉందంటే?

ఇది వెల్లలాగేకు ఐదవ టీ20 అంతర్జాతీయ మ్యాచ్. 2025 ఆసియా కప్‌లో అతని మొదటి మ్యాచ్. అతను శ్రీలంక తరపున 31 వన్డేలు ఆడాడు. ఆగస్టు 2024లో భారత్‌పై జరిగిన మ్యాచ్‌లో, అతను 27 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. 2023 ఆసియా కప్‌లో భారత్‌పై కూడా అతను ఐదు వికెట్లు పడగొట్టాడు. 2023 ఆసియా కప్‌లో 10 వికెట్లతో అతను సంయుక్తంగా రెండవ అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు.

బంగ్లాదేశ్‌తో సూపర్-4 మ్యాచ్ తర్వాత, శ్రీలంక సెప్టెంబర్ 23న పాకిస్థాన్‌, సెప్టెంబర్ 26న భారత్‌తో ఆడాల్సి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..