సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు దూరం కానున్న వార్నర్, బెయిర్‌స్టో

ఐపీఎల్ 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టోదే కీలక పాత్ర. ప్రత్యర్థి ఎవరైనా సరే దూకుడుగా ఆడుతూ వీరిద్దరూ సన్‌రైజర్స్‌కు శుభారంభాలు ఇస్తున్నారు. జట్టు బ్యాటింగ్ భారం మొత్తాన్ని వీరిద్దరే మోస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకూ సన్‌రైజర్స్ 9 మ్యాచ్‌లు ఆడగా.. వార్నర్-బెయిర్‌స్టో ద్వయం నాలుగు శతక భాగస్వామ్యాలు నెలకొల్పింది. వీరిద్దరూ ఈ సీజన్లో ఇప్పటికే 733 పరుగులు జోడించారు. ఐపీఎల్‌లో ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం […]

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు దూరం కానున్న వార్నర్, బెయిర్‌స్టో

Edited By:

Updated on: Apr 22, 2019 | 9:03 PM

ఐపీఎల్ 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టోదే కీలక పాత్ర. ప్రత్యర్థి ఎవరైనా సరే దూకుడుగా ఆడుతూ వీరిద్దరూ సన్‌రైజర్స్‌కు శుభారంభాలు ఇస్తున్నారు. జట్టు బ్యాటింగ్ భారం మొత్తాన్ని వీరిద్దరే మోస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకూ సన్‌రైజర్స్ 9 మ్యాచ్‌లు ఆడగా.. వార్నర్-బెయిర్‌స్టో ద్వయం నాలుగు శతక భాగస్వామ్యాలు నెలకొల్పింది. వీరిద్దరూ ఈ సీజన్లో ఇప్పటికే 733 పరుగులు జోడించారు. ఐపీఎల్‌లో ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం.

వార్నర్ ఈ సీజన్లో 9 మ్యాచ్‌ల్లో 73.85 సగటుతో 517 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. 63.57 సగటుతో 445 పరుగులు చేసిన బెయిర్‌స్టో రెండో స్థానంలో నిలిచాడు.

కోల్‌కతాతో మ్యాచ్ ముగిసిన తర్వాత వార్నర్, బెయిర్‌స్టోలపై సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ ప్రశంసలు గుప్పించాడు. వీరిని ప్రపంచ స్థాయి ఆటగాళ్లుగా అభివర్ణించిన విలియమ్సన్.. త్వరలోనే వీరి సేవలు సన్‌రైజర్స్ కోల్పోనుందని తెలిపాడు.

మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌ ఆడిన తర్వాత బెయిర్‌స్టో సన్‌రైజర్స్‌కు దూరం కానున్నాడు. ఇంగ్లాండ్ వరల్డ్ కప్ క్యాంప్‌లో పాల్గొనడం కోసం అతడు స్వదేశం వెళ్లనున్నాడు. ఐపీఎల్ తుది దశలో వార్నర్ కూడా ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు.