Gambhir vs Sreesanth: ముదిరిన శ్రీశాంత్, గంభీర్ వివాదం.. సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించిన మాజీ పేసర్..
S Sreesanth: లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత అంపైర్లు, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకోవలసి వచ్చింది. అయితే, గంభీర్ తనను దుర్భాషలాడుతున్నాడని, పదేపదే తనను ఫిక్సర్ అంటూ పిలుస్తున్నాడంటూ శ్రీశాంత్ ఒక వీడియోలో ఆరోపణలు గుప్పించాడు. గంభీర్ ఇప్పటి వరకు ఈ విషయంపై నేరుగా ఏమీ చెప్పలేదు. కానీ, అతను తన నవ్వుతున్న చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

Gambhir vs Sreesanth: ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లీ-గౌతమ్ గంభీర్, నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన పోరు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఏడాది చివర్లో క్రికెట్ మైదానంలో మరో సంచలనం వార్తల్లో నిలిచింది. ఇందులో గౌతమ్ గంభీర్‌తోపాటు టీమ్ ఇండియాలో అతని మాజీ సహచరుడు శాంతకుమారన్ శ్రీశాంత్ ఉండడం గమనార్హం. లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా మాజీ స్టార్స్ ఇద్దరు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అప్పటి నుంచి శ్రీశాంత్ నిరంతరం గంభీర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు. ఇప్పుడు అతను మాజీ ఓపెనర్‌పై విమర్శలు గుప్పిస్తున్నాడు. అబద్ధాలు, అంపైర్లను దుర్భాషలాడుతున్నాడని ఆరోపించాడు. దేవుడు అతన్ని ఎప్పటికీ క్షమించడు అంటూ చెప్పుకొచ్చాడు.
డిసెంబర్ 6వ తేదీ బుధవారం సూరత్‌లో జరిగిన మ్యాచ్‌లో, ఇండియా క్యాపిటల్స్‌కు చెందిన గంభీర్ బ్యాటింగ్ చేస్తుండగా, గుజరాత్ జెయింట్స్‌కు చెందిన శ్రీశాంత్ బౌలింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో గంభీర్ రెండు బౌండరీలు బాదగా, తర్వాతి రెండు బంతుల్లో శ్రీశాంత్ ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇక్కడ నుంచి ఇద్దరి మధ్య స్వల్ప స్లెడ్జింగ్ జరగడంతో అది కాస్తా తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఆటగాళ్లు, అంపైర్లు సాయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత, శ్రీశాంత్ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. గంభీర్ నిరంతరం తనను ఫిక్సర్ అని పిలిచి దుర్భాషలాడుతున్నాడని ఆరోపించాడు.
గంభీర్‌కి నవ్వుతూ రిప్లై..
View this post on Instagram
గంభీర్ ఇప్పటి వరకు ఈ విషయంపై నేరుగా ఏమీ చెప్పలేదు. కానీ, అతను తన నవ్వుతున్న చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రపంచం దృష్టిని ఆకర్షించడం ముఖ్యం. కానీ, మీరు నవ్వుతూనే ఉండండి అంటూ అందులో పేర్కొన్నాడు. ఇప్పటి వరకు తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వీడియోలు తీస్తూ పోస్ట్ చేసిన శ్రీశాంత్.. గంభీర్ నవ్వుతున్న చిత్రంపై కామెంట్ చేస్తూ సుదీర్ఘమైన్ పోస్ట్ చేశాడు. అందులో అతను మాజీ భారత ఓపెనర్‌ను దూషించాడు.
హద్దులు దాటితే దేవుడు కూడా క్షమించడు..
S Sreesanth’s comment on Gautam Gambhir’s Instagram post. pic.twitter.com/uko7yfvqWX
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2023
గంభీర్‌ని మందలించిన శ్రీశాంత్.. ఆటగాడిగా, సోదరుడిగా అన్ని హద్దులు దాటిపోయాడని చెప్పుకొచ్చాడు. గంభీర్ ఓ ప్రజాప్రతినిధి (ఎంపీ)అని, అయితే, ఇప్పటికీ ప్రతి క్రికెటర్‌తో గొడవలు పెట్టుకుంటున్నాడు. ఆ ఆరోపణల నుంచి సుప్రీంకోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించిన సంగతి గంభీర్‌కి తెలియదా’ అంటూ ప్రశ్నించారు.
గంభీర్ తనను, అంపైర్లను దుర్భాషలాడాడని శ్రీశాంత్ ఆరోపించాడు. ఎవరైనా గంభీర్‌ను ఎప్పటికీ క్షమించరని, దేవుడు కూడా క్షమించడు అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. ఇంతకాలం టీమ్ ఇండియా కోసం ఆడిన ఆటగాడి పట్ల గంభీర్ ప్రవర్తన ఆశ్చర్యంగా ఉందని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చాడు. పెంపకం ఎలా ఉంటుందో, ప్రవర్తన కూడా అలాగే ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..