AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిట్‌నెస్ పరీక్షలో ఫెయిల్.. కట్‌చేస్తే.. స్వ్కాడ్ నుంచి డేంజరస్ ప్లేయర్ ఔట్

Duleep Trophy Semis: దులీప్ ట్రోఫీ సెమీఫైనల్స్ కోసం సౌత్ జోన్ జట్టును ప్రకటించారు. అయితే, విజయ్ కుమార్ ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమైన తర్వాత జట్టు నుంచి తొలగించారు. వైశాఖ్, సాయి కిషోర్ లేకపోవడం సౌత్ జోన్ జట్టుకు భారీ దెబ్బ తగిలింది.

ఫిట్‌నెస్ పరీక్షలో ఫెయిల్.. కట్‌చేస్తే.. స్వ్కాడ్ నుంచి డేంజరస్ ప్లేయర్ ఔట్
Vyshak Vijay Kumar Dropped
Venkata Chari
|

Updated on: Sep 01, 2025 | 9:26 PM

Share

దులీప్ ట్రోఫీ (Duleep Trophy) సెమీ-ఫైనల్ రౌండ్ సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమవుతుంది. ఈ రౌండ్‌కు నాలుగు జట్లు అర్హత సాధించాయి. మొదటి సెమీ-ఫైనల్‌లో, శార్దూల్ ఠాకూర్ జట్టు రజత్ పాటిదార్ జట్టుతో తలపడనుండగా, రెండవ సెమీ-ఫైనల్‌లో, నార్త్ జోన్ జట్టు సౌత్ జోన్ జట్టుతో తలపడుతుంది. ఇప్పుడు ఈ రౌండ్‌కు సౌత్ జోన్ జట్టును కూడా ప్రకటించారు. కానీ, వైశాఖ్ విజయ్ కుమార్‌ను ఈ జట్టు నుంచి తొలగించారు. నివేదికల ప్రకారం, ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమైనందున వైశాఖ్‌ను జట్టు నుంచి తొలగించారు.

ఫిట్‌నెస్ పరీక్షలో వైశాఖ్ ఫెయిల్..

టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లు ఆడే ముందు అందరు ఆటగాళ్లు ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. ఈ ఫిట్‌నెస్ పరీక్షలో యో-యో టెస్ట్, బ్రోంకో టెస్ట్ ఉన్నాయి. ఇవి తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి. అయితే, వైశాక్ ఏ పరీక్షలో విఫలమయ్యాడో తెలియదు. కానీ జట్టు నుంచి అతనిని తొలగించడం సౌత్ జోన్ జట్టుకు దెబ్బగా మారింది. వైశాక్ దేశవాళీ క్రికెట్‌లో బాగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 26 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 103 వికెట్లు పడగొట్టాడు.

కెప్టెన్‌గా అజారుద్దీన్..

సౌత్ జోన్ జట్టుకు కేరళకు చెందిన మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గతంలో ఈ బాధ్యత తిలక్ వర్మకు ఇచ్చింది. కానీ, తిలక్ ఆసియా కప్ జట్టులో ఉన్నందున, ఇప్పుడు ఈ బాధ్యత అజారుద్దీన్‌కు ఇచ్చారు. నారాయణ్ జగదీశన్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. వైశాఖ్ మాత్రమే కాదు, తమిళనాడు స్పిన్నర్ సాయి కిషోర్ కూడా గాయం కారణంగా సెమీఫైనల్స్‌కు దూరమయ్యాడు. తిలక్ వర్మ స్థానంలో షేక్ రషీద్‌కు, సాయి కిషోర్ స్థానంలో అంకిత్ శర్మకు జట్టులో స్థానం కల్పించారు.

ఇవి కూడా చదవండి

దులీప్ ట్రోఫీకి సౌత్ జోన్ జట్టు..

మహ్మద్ అజారుద్దీన్ (కెప్టెన్-వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, దేవదత్ పడిక్కల్, మోహిత్ కాలే, సల్మాన్ నిజార్, నారాయణ్ జగదీశన్, టి విజయ్, అంకిత్ శర్మ, తనయ్ త్యాగరాజన్, ఎండీ నిధీష్, రికీ కసూత్, బాసిల్ ఎన్‌పీ, గుర్జాప్నీత్ సింగ్, రికీ కసూత్ సింగ్, గుర్జాప్నీత్.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..