వరల్డ్ కప్ 2019: మరో మ్యాచ్‌కు వరుణుడి అడ్డంకి

కార్డిఫ్‌:  ఐసీసీ వరల్డ్ కప్ 2019 ను వరణుడు తెగ అంతరాయం కలిగిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాన్స్‌ను ఇరిటేట్ చేస్తున్నాడు. ఇప్పటికే నాలుగు మ్యచ్‌లు వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. తాజాగా కార్డిఫ్ వేదికగా జరుగుతున్న సౌతఫ్రికా వర్సెస్ అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌కు మరోసారి అంతరాయం కలిగించాడు. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న అఫ్గాన్‌ 20 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. జట్టు స్కోరు 39 వద్ద హజ్రతుల్లా జజాయ్‌ (22; 23 బంతుల్లో […]

వరల్డ్ కప్ 2019: మరో మ్యాచ్‌కు వరుణుడి అడ్డంకి
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 15, 2019 | 8:41 PM

కార్డిఫ్‌:  ఐసీసీ వరల్డ్ కప్ 2019 ను వరణుడు తెగ అంతరాయం కలిగిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాన్స్‌ను ఇరిటేట్ చేస్తున్నాడు. ఇప్పటికే నాలుగు మ్యచ్‌లు వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. తాజాగా కార్డిఫ్ వేదికగా జరుగుతున్న సౌతఫ్రికా వర్సెస్ అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌కు మరోసారి అంతరాయం కలిగించాడు. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న అఫ్గాన్‌ 20 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.

జట్టు స్కోరు 39 వద్ద హజ్రతుల్లా జజాయ్‌ (22; 23 బంతుల్లో 3×4)ను రబాడ పెవిలియన్‌ పంపించాడు. 56 వద్ద రెహ్మత్‌ షా (6; 22 బంతుల్లో 1×4)ను మోరిస్‌ ఎల్బీడబ్లూగా పెవీలియన్‌కు పంపించాడు. నూర్‌ అలీ జర్దాన్‌(32; 57 బంతుల్లో 4×4), హష్మతుల్లా షాహిది (8; 18 బంతుల్లో 1×4) బ్యాటింగ్‌ చేస్తున్నారు. మ్యాచ్‌లో 20 ఓవర్లు ముగిసిన వెంటనే వర్షం మొదలైంది. చిరు జల్లులుగా మొదలైన వర్షం పెద్దదిగా మారింది. మరో రెండు గంటల పాటు వాన ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే స్టేడియంల నుంచి ప్రజలు నిరాశతో ఇంటి బాట పట్టారు. మొత్తంగా వరుణుడి ఖాతాలోకి మరో మ్యాచ్ వేసుకోవచ్చు అనమాట.