వరల్డ్ కప్ 2019: ఆరోన్ ఫించ్ నయా రికార్డ్

వరుణుడు కాస్త సహకరిస్తే వరల్డ్ కప్‌లో కొత్త రికార్డులకు వేదికయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పలు దేశాల ఆటగాళ్లు ప్రపంచ్ కప్ వేదికగా మ్యాజిక్ ఫిగర్స్ సాధిస్తున్నారు.   ఆస్ట్రేలియా కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్‌లో  వన్డే ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఫించ్‌ 132 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 153 పరుగులు […]

వరల్డ్ కప్ 2019: ఆరోన్ ఫించ్ నయా రికార్డ్
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 16, 2019 | 10:06 AM

వరుణుడు కాస్త సహకరిస్తే వరల్డ్ కప్‌లో కొత్త రికార్డులకు వేదికయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పలు దేశాల ఆటగాళ్లు ప్రపంచ్ కప్ వేదికగా మ్యాజిక్ ఫిగర్స్ సాధిస్తున్నారు.   ఆస్ట్రేలియా కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్‌లో  వన్డే ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఫించ్‌ 132 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 153 పరుగులు నమోదు చేశాడు. ఒక రకంగా బౌలర్లకు చుక్కలు చూపించాడు. చాకచక్యంగా ఆడుతూ వడివడిగా పరుగులతో పాటు రికార్డును కూడా సాధించాడు. దీనికిముందు ఇంగ్లండ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రికార్డు షేన్‌ వాట్సన్‌ పేరిట ఉంది. 2013లో సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వాట్సన్‌ ఈ ఘనత సాధించాడు. తాజాగా దీనిని ఫించ్‌ బ్రేక్‌ చేసి నూతన రికార్డును నెలకొల్పాడు.